Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంటికి భారీ భద్రత కోసం.. ఎవర్ని సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా?

ప్రస్తుతం వారం రోజుల వరకు సైఫ్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని వైద్యులు చెప్పారు. దీంతో సైఫ్ ఇంట్లోనే ఉన్నారు.

Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంటికి భారీ భద్రత కోసం.. ఎవర్ని సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా?

Saif Ali Khan Choose High Profile Security Agency for his Safety Details Here

Updated On : January 22, 2025 / 8:39 PM IST

Saif Ali Khan : ఇటీవల సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు సైఫ్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సైఫ్ కు తీవ్ర గాయాలు అవ్వడంతో హాస్పిటల్ లో చేరగా పలు సర్జరీల అనంతరం అయిదు రోజులు హాస్పిటల్ లోనే ఉండగా నిన్నే డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. భద్రతా లోపం కారణంగానే సైఫ్ పై దాడి జరిగిందని అంటున్నారు. దీంతో సైఫ్ రావడంతోనే తన ఇంటికి భద్రతా ఏర్పాట్లు చేయిస్తున్నాడు.

ప్రస్తుతం వారం రోజుల వరకు సైఫ్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని వైద్యులు చెప్పారు. దీంతో సైఫ్ ఇంట్లోనే ఉన్నారు. అయితే సైఫ్ ఇంటికి భద్రతగా ఇప్పటికే అపార్ట్మెంట్ చుట్టూ సీసీ కెమెరాలు బిగించారు. తాజాగా సైఫ్ ఇంటి కోసం, తన భద్రత కోసం ఏస్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఆశ్రయించాడు. సైఫ్ కు పర్సనల్ గా, ఇంటికి భద్రతగా ఈ ఏజెన్సీ భద్రతా సిబ్బందిని ఇవ్వనుంది.

Also Read : Venu Swamy – Allu Arjun : వేణుస్వామి మరో బాంబ్.. ఐటీ రైడ్స్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా.. ఆయన మాటల్లోనే..

ఇలాంటి క్లిష్టమైన సమయంలో సైఫ్ ఈ ఏజెన్సీనే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? అసలు ఈ ఏజెన్సీ ఎవరిదో తెలుసా? ఈ ఏజెన్సీని స్థాపించింది రోనిత్ రాయ్ అనే వ్యక్తి. ఇతను గతంలో అమీర్ ఖాన్ వద్ద రెండేళ్లు బాడీగార్డ్ గా పనిచేసాడు. 2000 సంవత్సరంలో రోనిత్ రాయ్ ఈ ఏజెన్సీని స్థాపించాడు. మొదట ఆమిర్ ఖాన్ లగాన్ సినిమాకు సెక్యూరిటీ అందించాడు. ఇది ముంబైలోనే హై ప్రొఫైల్ సెక్యూరిటీ ఏజెన్సీ. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్.. ఇలా చాలా మంది సినీ సెలబ్రిటీలకు రోనిత్ రాయ్ సంస్థనే సెక్యూరిటీ ఇస్తుంది.

Also See : Samantha : తన టీమ్‌తో కలిసి పికెల్ బాల్ ఆడిన సమంత.. ఫొటోలు చూశారా?

రోనిత్ రాయ్ సంస్థ ఏస్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కస్టమర్ సెక్యూరిటీ అవసరాన్ని బట్టి సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది. గతంలో సైఫ్ అలీ ఖాన్ ఇంటికి మాములు హౌస్ కీపింగ్ సంస్థ సెక్యూరిటీ ఇచ్చేది. ఇది డేడికేటెడ్ గా సెక్యూరిటీ ఏజెన్సీ కాదు. ఇప్పుడు సైఫ్ కి ఇలా జరగడంతో సైఫ్ తన సెక్యూరిటీ సంస్థని మార్చి ముంబైలోని హై ప్రొఫైల్ సంస్థ అయిన ఏస్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి తన సెక్యూరిటీని అప్పగించాడు.