Janhvi Kapoor : పుట్టినరోజు నాడు ప్రియుడితో కలిసి.. తిరుమల వెంకన్నని దర్శించుకున్న జాన్వీ..

పుట్టినరోజు నాడు ప్రియుడితో కలిసి తిరుమల వెంకన్నని దర్శించుకున్న జాన్వీ కపూర్. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు.

Janhvi Kapoor visits tirumala with her boy friend Shikhar Pahariya

Janhvi Kapoor : ఈరోజు (మార్చి 6) తన పుట్టినరోజు కావడంతో జాన్వీ కపూర్.. తన ప్రియుడితో కలిసి తిరుమల వెంకన్నని దర్శించుకున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే మనవడు శిఖర్‌ పహారియాతో జాన్వీ ప్రేమలో ఉందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలకు తగ్గట్లే వీరిద్దరూ కూడా ఈమధ్య కాలంలో ఎక్కడ కనిపించినా కలిసి కనిపిస్తున్నారు.

ఈ ఏడాది జనవరిలో ప్రియుడితో కలిసి తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకొని న్యూ ఇయర్ ని ప్రారంభించిన జాన్వీ కపూర్.. నేడు తన పుట్టినరోజు నాడు కూడా తిరుమలకు జంటగా వచ్చి దర్శనం చేసుకున్నారు. వీరిద్దరితో పాటు జాన్వీ పిన్ని మరియు నటి మహేశ్వరి కూడా వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Shivaratri Special Shows : శివరాత్రికి హైదరాబాద్‌లో స్పెషల్ షోస్.. ఏ సినిమాలో తెలుసా..!

ఇక బర్త్ డే సందర్భంగా జాన్వీ సినిమా అప్డేట్స్ విషయానికి వస్తే.. ఇన్నాళ్లు రామ్ చరణ్ RC16 లో హీరోయిన్ గా జాన్వీ చేస్తుంది అనే వార్తని నిజం చేస్తూ నేడు అప్డేట్ ఇచ్చారు. RC16 చిత్ర నిర్మాతలు జాన్వీకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. మూవీ యూనిట్ లోకి వెల్కమ్ పలికారు. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. మే నెల నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం.

అలాగే జాన్వీ నటిస్తున్న ‘దేవర’ నుంచి కూడా ఓ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో జాన్వీ లుక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.