Janhvi Kapoor : వసంత కోకిల శ్రీదేవిని తలపిస్తున్న కూతురు జాన్వీ

తాజాగా నిన్న దీపావళికి జాన్వీ ఫోటోలు చూసిన వాళ్ళు అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది అంటున్నారు. దీపావళి పండగ సందర్భంగా బోనీ కపూర్ తన ఆఫీస్ లో పూజ నిర్వహించారు. ఈ పూజకి శ్రీదేవి ఇద్దరు

Janhvi Kapoor : వసంత కోకిల శ్రీదేవిని తలపిస్తున్న కూతురు జాన్వీ

Janhvi

Updated On : November 5, 2021 / 11:43 AM IST

Janhvi Kapoor :  శ్రీదేవి.. ఆమె అందం అమోఘం. ఆమె నటన అద్భుతం. ఆమె లేకున్నా ఇప్పటికి ఆమె గురించి మాట్లాడుతున్నాం అంటే అది ఆమె గొప్పతనం. శ్రీదేవి సినిమాల్లోనూ, బయట కూడా ఎంతో పద్దతిగా ఉండేవారు. శ్రీదేవి మరణించాక ఆమె వారసురాలిగా కూతురు జాన్వీ తెరంగ్రేటం చేసింది. ముఖంలో తల్లి పోలికలున్నా నటనలో మాత్రం తల్లిని చేరుకోవడం అసాధ్యమే.

Bigg Boss 5 : షన్ను ఫేక్ అంటూ ఏడ్చేసిన సిరి

ఇక శ్రీదేవి ఎప్పుడూ పద్దతిగా కనిపిస్తే ఆమె కూతుర్లు మాత్రం ఇందుకు భిన్నంగా మోడర్న్ గా కనిపిస్తారు. సినిమాల్లోనూ, బయట, సోషల్ మీడియాలోనూ జాన్వీ అందంతో అభిమానులని సంపాదిస్తుంది. ఒక్కోసారి హాట్ హాట్ ఫోటోషూట్స్ తో మతి పోగొడుతుంది. బికినీ ఫోటోలని కూడా షేర్ చేసిన సన్నివేశాలు ఉన్నాయి. గతంలో జాన్వీ వస్త్రధారణపై శ్రీదేవితో పోలుస్తూ మీ అమ్మ పేరు చెడగొడుతున్నావు అంటూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా నిన్న దీపావళికి జాన్వీ ఫోటోలు చూసిన వాళ్ళు అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది అంటున్నారు. దీపావళి పండగ సందర్భంగా బోనీ కపూర్ తన ఆఫీస్ లో పూజ నిర్వహించారు. ఈ పూజకి శ్రీదేవి ఇద్దరు కూతుళ్లు వచ్చారు. అది కూడా పట్టు లంగావోణిలో ట్రెడిషినల్ గా రావడం విశేషం.

Bigg Boss Swetha : లక్ష రూపాయలిచ్చి నన్ను కమిట్‌మెంట్ అడిగారు : బిగ్ బాస్ శ్వేత

జాన్వీ అయితే అచ్చం ‘వసంతకోకిల’ సినిమాలో వాళ్ళ అమ్మలాగా బ్లూ కలర్ పట్టు వోణి కట్టుకొని వచ్చింది. జాన్వీ మొదటిసారి ఇంత పద్దతిగా కనిపించడం అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.