Jani Master : జైలు నుంచి వచ్చాక ఫస్ట్ టైం మీడియా ముందుకు జానీ మాస్టర్.. ఇలా జరిగితే ఎవరూ ఉండరు కానీ..

KCR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి జరగ్గా జానీ మాస్టర్ కూడా గెస్ట్ గా వచ్చారు.

Jani Master First Speech After came out from Jail goes Viral

Jani Master : ఇటీవల జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలతో జైలుకు వెళ్లగా బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ వివాదం సినీ పరిశ్రమలోనే కాక బయట కూడా చర్చగా మారింది. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ జానీ మాస్టర్ ఇదివరకులా యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్టులు పెడుతున్నారు. తాజాగా మొదటిసారి జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చారు.

రాకింగ్ రాకేష్ హీరోగా, నిర్మాతగా తీసిన KCR సినిమా నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి జరగ్గా జానీ మాస్టర్ కూడా గెస్ట్ గా వచ్చారు.

Also Read : Pushpa 2: బెంగళూరులో ఓ రేంజ్‌లో పుష్ప 2 ఈవెంట్‌ చేసే ప్లాన్‌

ఈ ఈవెంట్లో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ఒక భర్త వెనకాల భార్య ఉంటుంది. ఆ పవర్ కచ్చితంగా అంటుంది. ఈ మధ్య నాకు కొన్ని కొన్ని జరిగాయి. ఆ సమయంలో నా భార్య నాకు వెన్నుముకలాగా నిలబడింది. నాకు స్తంభంలాగా నిలబడింది. భర్తలకు ఉన్న ప్రతి భార్యలకు చెప్తున్నా అందరికి థ్యాంక్స్. మీరంతా మీ భర్తల వెనక ఉండబట్టే మీ భర్తలు సక్సెస్ అవుతున్నారు. అలా రాకేష్ వెనకాల ఆయన భార్య నిలబడింది. నన్ను నమ్మిన ప్రజలకు, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఎవరూ ఉండరు కానీ నన్ను నమ్మి నా కోసం నిలబడిన వాళ్లందరికీ చాలా థ్యాంక్స్. నా మీద మీరు పెట్టుకున్న నమ్మకం పోదు త్వరలోనే అది తెలుస్తుంది. ఇది సినిమా ఈవెంట్ కాబట్టి దాని గురించి ఇంక మాట్లాడాలనుకోవట్లేదు అని అన్నారు. అనంతరం సినిమా గురించి మాట్లాడారు.

దీంతో జైలు నుంచి బయటకు వచ్చి మొదటిసారి ఓ ఈవెంట్లో పాల్గొని మీడియా ముందు జానీ మాస్టర్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.