Pushpa 2: బెంగళూరులో ఓ రేంజ్‌లో పుష్ప 2 ఈవెంట్ చేసే ప్లాన్
నార్త్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసుకున్న మూవీ యూనిట్..సౌత్‌లో అదిరిపోయే ఈవెంట్‌కు ప్లాన్ చేస్తుందట.

Allu Arjun
నేషనల్ వైడ్‌గా పుష్ప క్రేజ్ చూస్తుంటే నెవర్ బిఫోర్ రేంజ్ అనిపిస్తోంది. తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ ఫీవర్ సౌత్ టు నార్త్ ఆడియెన్స్‌ను పట్టేసింది. బీహార్‌లోని పాట్నాలో నిర్వహించిన పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అదిరిపోయింది. అంచనాలకు మించి ఫ్యాన్స్ రావడంతో మూవీ యూనిటే కాదు..అల్లుఅర్జున్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. పుష్పరాజు ఎప్పుడూ తగ్గరని..కానీ మీ అభిమానానికి తలవంచి నమస్కరిస్తున్నట్లు చెప్పాడు. పాట్నా ఈవెంట్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో రిలీజ్ కంటే ముందే పుష్ప-2 విపరీతమైన బజ్ క్రియేట్ చేసుకుంది.
నార్త్ స్టేట్ బిహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎవరూ ఊహించని రేంజ్‌లో సక్సెస్ అయింది. ఇంతవరకు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ రేంజ్‌లో ఈవెంట్ చేయలేదు. దాదాపు 2 లక్షల మంది ప్రేక్షకులు ఈవెంట్‌కు వచ్చారంటే పుష్ప మానియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఇప్పుడు పాట్నా ఈవెంట్‌పైనే డిస్కషన్ జరుగుతోంది.
అయితే నార్త్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసుకున్న మూవీ యూనిట్..సౌత్‌లో అదిరిపోయే ఈవెంట్‌కు ప్లాన్ చేస్తుందట. నవంబర్ 23న బెంగుళూరులో ట్రైలర్ లాంచ్ చేస్తారట. అయితే పాట్నా ఈవెంట్‌కు మించి బెంగుళూరులో ప్రమోషన్స్‌కు మూవీ యూనిట్, అల్లుఅర్జున్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాట్నా ఈవెంట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంటే..మరో ఈవెంట్‌తో అంతకు మంచి హైప్ క్రియేట్ చేయాలని భావిస్తోంది మూవీ యూనిట్.
డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా పుష్ప-2 మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్ హీరోగా పుష్ప-2 తెరకెక్కుతోంది. ఇప్పటికీ ఫ్యాన్స్‌ను పుష్ప-1 ఫీవర్ వదలడం లేదు. ఇప్పుడు పుష్ప-2 ట్రైలర్ ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తుంది. అందులో భాగంగానే ప్రమోషన్స్ అదరగొడుతున్నారు. పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు క్రేజీ రెస్పాన్స్ రావడంతో..మూవీ యూనిట్ ఫుల్ ఖుష్‌లో ఉంది. బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లోనూ ప్రమోషన్స్ నిర్వహించే ప్లాన్ జరుగుతోందట. ఇలా నార్త్ టు సౌత్ పుష్ప ఫీవర్..సమ్‌థింగ్ స్పెషల్‌గా మారింది.
Thaman S : వామ్మో.. తమన్ మూవీ లైనప్ చూసారా.. ఒకేసారి అన్ని సినిమాలా..