Jani Master helped to 500 people in Vijayawada flood areas
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరద భీభత్సం సృష్టించింది. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాలు నీట మునిగాయి. ఓ వైపు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేయగా మరో వైపు అనేక మంది తమ వంతు సాయంగా విరాళాలు అందజేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, జనసేన నేత జానీ మాస్టర్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నడుములోతు నీళ్లలోనూ నడుచుకుంటూ వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. 500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ సాయం చేయాలని కోరారు. జానీ మాస్టర్ వరద బాధితులను పరామర్శిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Bigg Boss 8 Promo : హౌస్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన సీత.. నేనే గిన్నెలు తోమాల్నా..?
‘వరద ఉధృతి కి మునిగిన రామవరప్పాడు, సింగినగర్, విజయవాడ ప్రాంతాల్లో మా జనసైనికులతో తిరిగి 500 కుటుంబాలకి సరిపడే నిత్యావసర సరుకులని పంపిణీ చేసాం. అక్కడి పరిస్థితులని మాటల్లో చెప్పలేం, వచ్చి చూస్తే కానీ తెలియదు. చాలా కష్టపడి, ఇష్టపడి కట్టుకున్న సొంతిల్లు మునిగిపోయి, అయినవారిని, ఆసరాని కోల్పోయి చాలా తల్లడిల్లిపోతున్నారు. పార్టీలకి అతీతంగా అందరూ సహాయపడాల్సిన సమయమిది. పవన్ అన్న సహాయం ప్రతి ఒక్కరికీ చేరాలనే ఉద్దేశంతో మా జనసైనికులని, మా వీర మహిళల్ని ఇక్కడకి పంపించారు. వీరందరికీ ఈ సమయంలో భరోసానివ్వడం వదిలేసి మాటలనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అందరూ తోచినంత సాయం చేస్తే ఈ పరిస్థితి నుండి వీరు త్వరగా కోలుకుంటారు.’ అని రాసుకొచ్చాడు.
దీంతో జానీ మాస్టర్‌ని జనసైనికులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.
Mangampeta : ‘మంగంపేట’ గ్లింప్స్ రిలీజ్.. చంపాల్సింది రాక్షసులని కాదు రావణుడిని..
వరద ఉధృతి కి మునిగిన రామవరప్పాడు, సింగినగర్, విజయవాడ ప్రాంతాల్లో మా జనసైనికులతో తిరిగి 500 కుటుంబాలకి సరిపడే నిత్యావసర సరుకులని పంపిణీ చేసాం. అక్కడి పరిస్థితులని మాటల్లో చెప్పలేం, వచ్చి చూస్తే కానీ తెలియదు. చాలా కష్టపడి, ఇష్టపడి కట్టుకున్న సొంతిల్లు మునిగిపోయి, అయినవారిని, ఆసరాని… pic.twitter.com/nV1at8uPjl
— Jani Master (@AlwaysJani) September 6, 2024