Mangampeta : ‘మంగంపేట’ గ్లింప్స్ రిలీజ్.. చంపాల్సింది రాక్షసులని కాదు రావణుడిని..

తాజాగా మంగంపేట సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Mangampeta : ‘మంగంపేట’ గ్లింప్స్ రిలీజ్.. చంపాల్సింది రాక్షసులని కాదు రావణుడిని..

Mass Action Entertainer Mangampeta Glimpse Released

Mangampeta : చంద్రహాస్ కే, అంకిత సాహా జంటగా తెరకెక్కుతున్న సినిమా మంగంపేట. భాస్కర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో గౌతం రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నాగ మహేష్, కబీర్ సింగ్, కాలకేయ ప్రభాకర్, దయానంద్ రెడ్డి, ఎస్తర్ నోరోన్హా, పృధ్వీరాజ్, అడుకలం నరేన్, సమ్మెట గాంధీ, సమీర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Also Read : Mokshagnya Full Name : బాలయ్య తనయుడు ‘మోక్షజ్ఞ’ పూర్తిపేరు ఏంటో తెలుసా? తాతయ్య పేరు వచ్చేలా..

20 ఏళ్లు అయిందిరా.. ఊరిని చూడాలనిపిస్తుందిరా అని అమ్మ కొడుకుని అడిగితే.. ఊరినిండా రాక్షసులే ఉన్నారు.. వాళ్లని చంపి ఊరిని చూపిస్తానమ్మా అని కొడుకు చెప్పే మాటలతో మొదలైన టీజర్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగింది. ఒక ఊరు ఊరులో బొగ్గు మాఫియా, అక్కడ ఉండే విలన్స్, వాళ్ళని హీరో ఎదిరించి తన తల్లిని ఊరికి ఎలా తీసుకెళ్లాడు అనే కథాంశంతో సినిమా రాబోతున్నట్టు ఈ మంగంపేట గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తుంది. చంపాల్సింది రాక్షసుల్ని కాదు.. రావణుడ్ని,‘రాముడు రాలేకపోవచ్చు.. శివుడు శూలాన్ని పంపిస్తే.. చేయాల్సింది యుద్దం కాదు శివ తాండవం’ లాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ గ్లింప్స్ లోనే వినిపించారు. మీరు కూడా మంగంపేట గ్లింప్స్ చూసేయండి..

 

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది మంగంపేట సినిమా. ఈ గ్లింప్స్ తో ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతుందని తెలుస్తుంది.