Jayam Ravi : నా పిల్లలను దూరం చేయకు.. గతంలో వెన్నుపోటు.. ఇప్పుడు డైరెక్ట్ గానే పొడిచింది.. భార్యకు కౌంటర్ ఇచ్చిన హీరో..

జయం రవి భార్యకు గట్టి కౌంటర్ ఇస్తూ పోస్ట్ చేసాడు.

Jayam Ravi : నా పిల్లలను దూరం చేయకు.. గతంలో వెన్నుపోటు.. ఇప్పుడు డైరెక్ట్ గానే పొడిచింది.. భార్యకు కౌంటర్ ఇచ్చిన హీరో..

Jayam Ravi Strong Counter to his Wife Aarti Ravi and gives Clarity on Relation with Kenishaa Francis Tweet goes Viral

Updated On : May 15, 2025 / 4:49 PM IST

Jayam Ravi : తమిళ్ స్టార్ కపుల్ జయం రవి – ఆర్తి రవి గత కొన్నాళ్ల నుంచి వార్తలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జయం రవి తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే, ఆర్తి రవి మాత్రం నాకు తెలియకుండానే ఆ పోస్టు పెట్టారు అంటూ రవిపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో జయం రవి ఓ సింగర్ కెనిషాతో ప్రేమలో ఉన్నాడని వార్తలు రావడం, వారిద్దరూ కలిసి తిరిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

దీంతో ఇటీవల ఆర్తి రవి.. రవి నన్ను మోసం చేసాడు, నా పిల్లల్ని పట్టించుకోవట్లేదు, తండ్రి భాద్యత తీసుకోవట్లేదు, నన్ను చాలా కష్టపెట్టాడు అంటూ పలు ఆరోపణలు చేస్తూ సింపతీ వచ్చేలా తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనికి ఇప్పుడు జయం రవి గట్టిగా కౌంటర్ ఇస్తూ పోస్ట్ చేసాడు. ఓ నాలుగు పేజీల లెటర్ ని రాసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఒకప్పుడు వెన్నుపోటు పొడిచారు, ఇప్పుడు డైరెక్ట్ గా ఛాతిలో పొడిచారు. నా దగ్గర్నుంచి వస్తున్న మొదటి, చివరి సమాధానం ఇదే అని రాసుకొచ్చాడు.

Also Read : NTR – Aamir Khan : ఎన్టీఆర్ వర్సెస్ అమీర్ ఖాన్.. ఎవరు దాదా సాహెబ్ ఫాల్కే..? ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్..

జయం రవి రాసిన లెటర్ లో.. నా ప్రైవేట్ లైఫ్ ఇప్పుడు పబ్లిక్ లో ఉంది. దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నేను సైలెంట్ గా ఉన్నాను అంటే వీక్ అని కాదు. నేను కష్టపడి పేరు సంపాదించుకున్నాను. నా పాత రిలేషన్ లో ఉన్నవాళ్లు సింపతీతో ఫేమ్ తెచ్చుకుందామని ట్రై చేస్తున్నారు. నేను లీగల్ ప్రాసెస్ ని నమ్ముతున్నాను. కేసు ఇంకా కోర్ట్ లో ఉండగా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆమె వల్ల నేను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతిన్నాను. నా పేరెంట్స్ కి దూరమయ్యాను. నన్ను గతంలో వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ముందు నుంచే పొడుస్తున్నారు. అందుకే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను.

ఇప్పటికే నా డైవర్స్ గురించి నా అనుకున్న వాళ్లందరికీ క్లియర్ గా చెప్పాను. కానీ నా క్యారెక్టర్ నే కాదు, నా తండ్రి బాధ్యతని కూడా పబ్లిక్ గా విమర్శిస్తున్నారు. నా పిల్లలు అంటే నాకు ఇష్టం. నా పిల్లల్ని పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేస్తున్నారు. నా పిల్లలకు నేను డబ్బులు ఇస్తున్నాను. అసలు నా పిల్లలని కలవనివ్వట్లేదు. వాళ్లకు బౌన్సర్లు ని పెట్టారు. నన్ను వాళ్ళ దగ్గరికి కూడా వెళ్లనివ్వడం లేదు. నా భార్యకు, పిల్లలకు ఆర్థికంగా అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చాను. కానీ ఇవాళ నన్ను ఒక తండ్రిగా ప్రశ్నిస్తున్నారు. నా పిల్లలు నిజం తెలుసుకుంటారు. నేను నా భార్యని వదిలేసాను కానీ నా పిల్లలను కాదు. చట్ట ప్రకారం నేను వాళ్లకు డబ్బులు ఇస్తున్నాను. అంతేకాని నేను వాళ్ళని సింపతే కోసం వాడుకోవట్లేదు. నేను ఎంత కష్టపడి వాళ్ళ కోసం సపోర్ట్ చేసినా నన్ను ఇలా నిందిస్తున్నారు.

ఓ ఐదేళ్ల సంపాదన మా పేరెంట్స్ కి కూడా పంపించకుండా వీళ్ళకే ఇచ్చాను అయినా నన్ను నిందిస్తున్నారు. సినీ పరిశ్రమలో నాతో ఉన్న వాళ్లకు నా గురించి తెలుసు. 10 రోజుల క్రితం కూడా వాళ్ళ అమ్మ నన్ను పిలిచి ఆమె తీసుకున్న లోన్స్ కి షూరిటీ ఇమ్మని అడుగుతున్నారు. గత 16 ఏళ్లుగా నేను పడే బాధ ఇది. ఇప్పటికైనా ఈ గేమ్ ఆపేయ్. నా పిల్లలను దూరం చేయాలని చూడకు. ఇక నుంచి నేను ఏం ఉన్నా కోర్ట్ లోనే కలుస్తాను. నా మాజీ భార్యకు, వాళ్ళ ఫ్యామిలీకి కేవలం కాంట్రవర్సీలు డబ్బులు కురిపిస్తాయి అని రాసుకొచ్చాడు.

Also Read : Rajamouli : రాజమౌళి ఇండస్ట్రీని పాడు చేశారు.. డిస్ట్రిబ్యూటర్ సంచలన వ్యాఖ్యలు..

అలాగే తాను సింగర్ తో ప్రేమలో ఉన్నాడు అనే దానిపై కూడా స్పందిస్తు.. కెనీషా గురించి మాట్లాడేవాళ్ళకు.. నేను నా ఇంటి నుంచి అన్ని వదిలేసి కట్టు బట్టలతో వచ్చేసినప్పుడు తనే నన్ను సపోర్ట్ చేసింది. నేను బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు తోడు ఉంది. ఒక ఫ్రెండ్ గా పరిచయం అయి ఇప్పుడు నాకు దగ్గరైంది. నా కష్టాలు అన్ని కెనీషా దగ్గరుండి చూసింది. తను నన్ను హ్యాపీగా ఉంచాలని కోరుకుంది. నాకు, నా పేరెంట్స్ కి, నా టీమ్ కి తనెంత సపోర్ట్ చేసిందో మాకు తెలుసు. తన క్యారెక్టర్ ని ఎవరైనా అగౌరవపరచడాన్ని ఒప్పుకోను. నన్ను ఎలా గౌరవిస్తారో కెనీషాని కూడా అలాగే గౌరవించండి. రెగ్యులర్ గా నేను సినిమాలు చేసి మిమ్మల్ని మెప్పిస్తాను. సోషల్ మీడియాలో నా మీద విమర్శలు చేస్తారు కానీ అవేమి పట్టించుకోను. నేను మన న్యాయవ్యవస్థని నమ్ముతాను అని తెలిపారు. దీంతో జయం రవి పోస్ట్ వైరల్ గా మారింది.

మొత్తానికి తమిళ సినీ పరిశ్రమలో వీరిద్దరి విడాకులు చర్చగా మారాయి. అయితే రవి దీనిపై మళ్ళీ స్పందించను అని డైరెక్ట్ గానే చెప్పేసాడు. అయితే ఆర్తి రవి మళ్ళీ జయం రవి వ్యాఖ్యలపై స్పందించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.

Also Read : Karate Kid – Legends : ‘కరాటే కిడ్ : లెజెండ్స్’ కోసం తండ్రి కొడుకులు.. అజయ్ దేవగణ్ – యుగ్ దేవగణ్..