Vishnu Priya : JD చక్రవర్తిని పెళ్లి చేసుకుంటా అన్న విష్ణుప్రియ.. JD ఏమన్నాడో తెలుసా?
ఇటీవల యాంకర్ విష్ణుప్రియ ఓ షోలో మాట్లాడుతూ JD చక్రవర్తి అంటే ఇష్టం అని, అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని, వాళ్ళ అమ్మని కూడా ఒప్పిస్తా అని, JD చక్రవర్తిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అని చెప్పింది. దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

JD Chakravarthy reacts on Anchor Vishnupriya comments on marriage with him
JD Chakravarthy : శివ, మనీ, గులాబీ, సత్య.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన JD చక్రవర్తి ప్రస్తుతం పలు సినిమాల్లో, సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో JD చక్రవర్తి అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల యాంకర్ విష్ణుప్రియ ఓ షోలో మాట్లాడుతూ JD చక్రవర్తి అంటే ఇష్టం అని, అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని, వాళ్ళ అమ్మని కూడా ఒప్పిస్తా అని, JD చక్రవర్తిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అని చెప్పింది. దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తాజాగా JD చక్రవర్తి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు. JD చక్రవర్తి మాట్లాడుతూ.. ఇటీవల నేను, విష్ణుప్రియ కలిసి ఓ సిరీస్ లో నటించాం. అది త్వరలో రిలీజ్ అవుతుంది. ఈ సిరీస్ కోసం దాదాపు 40 రోజులు కలిసి షూట్ చేశాం. ఆ సమయంలో ఇద్దరం క్లోజ్ అయ్యాం. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అది ప్రేమ కాదు. ఇక ఆ సిరీస్ డైరెక్టర్ కూడా నాతో ఇంకా బాగా విష్ణుప్రియ నటించాలని తనని నా సినిమాలను చూడమన్నాడు. అలా ఆమె నా క్యారెక్టర్స్ తో ప్రేమలో పడింది. అంతే తప్ప అది మీరనుకునే ప్రేమ కాదు. మా ఇద్దరి మధ్య ఒక మంచి అనుబంధం ఉంది అని అన్నారు.
Tamannaah – Vijay Varma : వామ్మో ప్రమోషన్స్ కోసం.. బాయ్‌ఫ్రెండ్ తో హాట్ ఫొటోషూట్ చేసిన తమన్నా..
మరి దీనిపై విష్ణుప్రియ మళ్ళీ స్పందిస్తుందేమో చూడాలి. యాంకర్ గా పలు షోలు చేసిన విష్ణుప్రియ ప్రస్తుతం పలు టీవీ షోలలో కనిపిస్తూ సినిమాలు, సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోషూట్స్ తో హడావిడి చేస్తుంది. JD తన భార్య అనుకృతితో గత సంవత్సరం విడాకులు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.