NTR31 : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ నుంచి సాలీడ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు గతేడాదే వెల్లడించారు.

JR NTR- Prashanth neel : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు గతేడాదే వెల్లడించారు. ఎన్టీఆర్ కెరీర్‌లో 31వ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోస్‌లో నిర్వహించారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌లు తమ కుటుంబ సమేతంగా హాజరుఅయ్యారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. కాగా.. ప్రస్తుతం ‘#NTRNeel’ హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనున్న సంగతి తెలిసిందే. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది.
Also Read : మహేశ్‌బాబు బర్త్ డే.. కొడుకు, కూతురు ఎలా విషెస్ చెప్పారో తెలుసా..?
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను నీల్ ఎలా చూపిస్తారా అని అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడాడు. అందరూ ఈ మూవీని యాక్షన్ చిత్రంలా భావిస్తారని తనకు తెలుసునని అన్నాడు. అయితే.. ఆ జానర్‌లోకి తాను వెళ్లాలని అనుకోవడం లేదన్నాడు. ఇది నాకు చాలా కొత్త కథ. భిన్నమైన భావోద్వేగాలతో వైవిధ్యభరిత చిత్రంగా మాత్రం ఉంటుందన్నాడు. కాగా.. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Also Read: ‘కాలం రాసిన కథలు’ ట్రైలర్ చూశారా? ఆకాష్ జగన్నాధ్ చేతుల మీదుగా రిలీజ్..
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ వార్ 2లో నటిస్తున్నాడు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రాన్ని చేస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This time, the earth will tremble under his reign! ?#NTRNeel will step onto the soil on January 9th, 2026 ❤️?
MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial pic.twitter.com/MfS0aS8OlV
— Mythri Movie Makers (@MythriOfficial) August 9, 2024