Mahesh Babu : మ‌హేశ్‌బాబు బ‌ర్త్ డే.. కొడుకు, కూతురు ఎలా విషెస్ చెప్పారో తెలుసా..?

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన రోజు నేడు (ఆగ‌స్టు 9).

Mahesh Babu : మ‌హేశ్‌బాబు బ‌ర్త్ డే.. కొడుకు, కూతురు ఎలా విషెస్ చెప్పారో తెలుసా..?

Gautham and Sitara wishes to mahesh babu on his birthday

Updated On : August 9, 2024 / 11:31 AM IST

Mahesh Babu birthday : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన రోజు నేడు (ఆగ‌స్టు 9). ఈ రోజు ఆయ‌న 49 ప‌డిలో అడుగుపెట్టాడు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు, నెటిజ‌న్లు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇంకోవైపు మురారి రీ రిలీజ్‌తో థియేట‌ర్ల‌లో సంద‌డి నెల‌కొంది.

మ‌హేశ్ కుమారుడు గౌత‌మ్‌, సూప‌ర్ స్టార్ గారాల ప‌ట్టి సితార లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తండ్రికి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశారు.

Kaalam Raasina Kathalu : ‘కాలం రాసిన కథలు’ ట్రైలర్ చూశారా? ఆకాష్ జగన్నాధ్ చేతుల మీదుగా రిలీజ్..

‘పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు నాన్నా.. మీరు చేసే ప్ర‌తి ప‌నిలో మీరే సూప‌ర్ స్టార్‌. ఈ రోజే కాదు ప్ర‌తి రోజు మీకు అద్భుత‌మైన రోజు కావాల‌ని కోరుకుంటున్నాను.’ అని గౌత‌మ్ అన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Gautam Ghattamaneni (@gautamghattamaneni)

ఈ ప్ర‌పంచంలో మీరే ఉత్త‌మ తండ్రి. పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు నాన్నా.. నేను మిమ్మ‌ల్ని ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ సితార ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. త‌న కుటుంబంతో క‌లిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by sitara (@sitaraghattamaneni)

గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టిన మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌నున్నారు. ఈ మూవీ కోసం మ‌హేశ్ జుట్టు, బాడీ పెంచి లుక్ మార్చుకునే ప‌నిలో ఉన్నారు. ఇక ఈ సినిమా స్క్రిప్ర్ వర్క్ పూర్తయిందని, మ్యూజిక్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే పూజా కార్యక్రమాలతో సినిమా మొదలుపెడతారని సమాచారం.

Pawan Kalyan-Allu Arjun : ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ టార్గెట్‌ చేశారా..?