Pawan Kalyan-Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ టార్గెట్ చేశారా..?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను టార్గెట్ చేశారా..?
Pawan Kalyan-Allu Arjun : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను టార్గెట్ చేశారా..? 40 ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడే వాడు.. ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు అంటూ పవన్ చేసిన విమర్శలు దేనికి సంకేతం? ఎన్నికల సమయంలో అల్లు ఫ్యామిలీతో మెగా కుటుంబానికి గ్యాప్ వచ్చిందనే టాక్ నిజమనుకోవాలా? డిప్యూటీ సీఎం ఆగ్రహంతో పుష్ప-2 సినిమాకు సెన్సార్ కష్టాలు పొంచివున్నట్లేనా? మెగా-అల్లు కుటుంబం మధ్య ఏం జరిగింది? పవన్ కామెంట్స్ వెనుక సీరియస్‌నెస్ ఎంత?
అల్లు అర్జున్‌పై పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చిందా..? బెంగళూరు పర్యటనలో పవన్ పుష్ప సినిమాను టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారం నిజమేనని నమ్మాల్సివస్తోందంటున్నారు సినీ విమర్శకులు.
సినిమా చెట్టు పునరుజ్జీవానికి ప్రయత్నం.. కుమారదేవం గ్రామంలో డైరెక్టర్ వంశీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన స్నేహితుడైన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడం విమర్శలకు దారితీసింది. జనసేనాని పవన్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీచేయగా, ఆయనకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్… ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా క్షేత్రస్థాయి ప్రచారానికి వెళ్లడం పవన్ ఆగ్రహానికి కారణమైందంటున్నారు.
అప్పటి నుంచి ఈ వివాదం ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా టాలీవుడ్ ఎవరి తాత సొత్తు కాదంటూ చేసిన వ్యాఖ్యలు అల్లు ఫ్యామిలీని ఉద్దేశించినవే అన్న ఊహాగానాలకు తెరలేపాయి. ఇదే సమయంలో మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్, నాగబాబు కుమార్తె నిహారిక… తమ ఎక్స్ ఖాతాలో అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేశారు. ఈ వరుస సంఘటనలతో అల్లు ఫ్యామిలీతో మెగా కాంపౌండ్‌కి గ్యాప్ వచ్చిందనే టాక్ తీవ్రమైంది.
Chiranjeevi : కేరళలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌తో భేటీ
ఎన్నికల సమయంలో మొదలైన ఊహాగానాలు ఇప్పటికీ ఏదో రూపంలో ప్రచారంలో ఉంటూనే ఉన్నాయి. ఎన్నికల్లో హండ్రడ్ పర్సంట్ స్ట్రైక్ రేట్‌తో విక్టరీ కొట్టిన పవన్.. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లగా కుటుంబ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. ఆ సమయంలోనూ అల్లు కుటుంబం కనిపించకపోవడంతో విభేదాలు మరింత తీవ్రమైనట్లు టాక్ వినిపించింది. ఐతే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని పవన్ తొలిసారిగా పుష్ప సినిమా ఇతివృత్తాన్నే టార్గెట్ చేస్తున్నట్లు విమర్శలు చేయడం సంచలనమైంది. ఇప్పటికే పుష్ప ఫస్ట్‌పార్ట్ తెలుగునాట సంచలన విజయం సాధించగా, రెండో పార్ట్ శరవేగంగా నిర్మితమవుతోంది.
కన్నడ సినిమా గంధడ గుడిని ప్రస్తావిస్తూ పుష్పపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు పవన్. గంధడ గుడి సినిమా నేపథ్యం అంతా అడవులు, ప్రకృతినే రక్షించాలనే కథే ఉంటుంది. ఈ సినిమాకు పూర్తి విరుద్ధమైన కథాంశంతో పుష్ప ఉంటుంది. దీంతో పవన్ వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదలకు రెడీ అవుతోంది. దీంతో పవన్ వ్యాఖ్యలు ఖచ్చితంగా పుష్ప 2 పై ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ పై కోపంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ తాజా వ్యాఖ్యలతో మరింత రెచ్చిపోయే అవకాశం లేకపోలేదంటున్నారు.