Chiranjeevi : కేరళలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌తో భేటీ
వారం రోజుల క్రితం కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌తో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.

Mega Star Chiranjeevi Met Kerala CM Pinarayi Vijayan
Chiranjeevi – CM Pinarayi Vijayan : వారం రోజుల క్రితం కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌తో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కొండ చరియలు విరిగి పడి 360 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు సినీ పరిశ్రమలోని పలువురు స్టార్స్ ముందుకు వచ్చారు. తన వంతు బాధ్యతగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌లు సంయుక్తంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో నేడు (గురువారం) సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి కేరళకు వెళ్లారు. త్రివేండ్రంలో విమానాన్ని దిగిన వెంటనే చిరు నేరుగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీఎం విజయన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రూ.కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.
Double ISMART : ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ‘బిగ్ బుల్’ లిరికల్ సాంగ్..
త్రివేండ్రంలో చిరు విమానం దిగిన వీడియోలు, ముఖ్యమంత్రికి చెక్కును అందజేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగాస్టార్ ది మంచి మనసు అని, చెప్పితే ఖచ్చితంగా చేసే వరకు ఊరుకోడు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Raj Tarun : తెలంగాణ హైకోర్టులో రాజ్‌తరుణ్‌కు ఊరట..
కోటి రూపాయలు CM రిలీఫ్ ఫండ్ కి విరాళాన్ని పద్మ విభూషణ్ మెగాస్టార్ డా. చిరంజీవి గారు మరియు గ్లోబల్ స్టార్ డా. రామ్ చరణ్ గారు వెంటనే ప్రకటించి, ఈరోజు సాయంత్రం కోటి రూపాయల చెక్ ను మెగాస్టార్ చిరంజీవి గారు కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పినరాయి విజయన్ గారికి… pic.twitter.com/NjArlVE1VQ
— Suresh PRO (@SureshPRO_) August 8, 2024