Jr NTR: సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేశారా?
ముందెన్నడూ లేని విధంగా దేవరను టార్గెట్ చేసి ట్రోల్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు.

సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేశారా? దేవర సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ చేసేలా ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో కొన్ని పరిణామాలు జూనియర్ ఎన్టీఆర్‌కు శాపంగా మారుతున్నాయా? ఆ కారణాలతోనే పొలిటికల్ ట్రోలింగ్ జరుగుతోందా? దేవరకు ఎదురవుతున్న కష్టాలేంటి? దేవరపై ఏం ట్రోలింగ్ జరుగుతోంది….
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా కొన్ని పాటలు, ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పాటలకు మిశ్రమ స్పందన వస్తుండగా, ట్రైలర్‌పై మాత్రం విపరీతమైన పొలిటికల్ ట్రోలింగ్ జరుగుతోందంటున్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో రెండు పార్టీల అభిమానులు దేవరను టార్గెట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవర ట్రైలర్‌ను కొందరు ఆచార్య సినిమాతో పోల్చుతుండగా, మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ గతంలో తీసిన ఆంధ్రా వాలా సినిమాను గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
చాలా కారణాలు
ముందెన్నడూ లేని విధంగా దేవరను టార్గెట్ చేసి ట్రోల్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రధానంగా రాజకీయంగా టార్గెట్ చేయడం వల్లే ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతోందని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. తమ అభిమాన స్టార్ ఎన్టీఆర్ సినిమాపై నెగిటివ్ పబ్లిసిటీ తెచ్చేవిధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఏపీలో రెండు పొలిటికల్ పార్టీలు కార్యకర్తలు ఈ ట్రోల్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో దేవర సినిమాకు ఇబ్బందులు తప్పవని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఇవాళ ఉదయం నుంచి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అరెకపూడి గాంధీని విడుదల చేయడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు చెబుతున్నారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: విజయవాడలో బాలకృష్ణతో యువ హీరోలు విశ్వక్‌సేన్, సిద్ధు జొన్నలగడ్డ