Devara Part 1: దేవరను ఇంకా చెక్కుతున్నారా? ఏం జరుగుతోంది?
దేవర సినిమా రన్‌టైమ్‌ను దాదాపు పదిహేను నిమిషాల పాటు తగ్గించినట్లు..

NTR Devara Movie
ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా భారీ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ… ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల డైరెక్షన్‌లో వస్తోంది దేవర. దేవరపై ఆయన మరింత శ్రద్ధ పెట్టడంతో చిత్ర పరిశ్రమలో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు అందుకోవాలనే ప్రయత్నంలో సెన్సార్ పూర్తయిన తర్వాత కూడా సినిమా ఎడిటింగ్‌కు సిద్ధమయ్యాడట డైరెక్టర్. మరో వారం రోజుల్లో విడుదల కానున్న సినిమాకు ఎలాంటి మార్పులు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం…
ఎన్టీఆర్ దేవర మూవీ ఈ నెల 27న పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది. జనతా గ్యారేజ్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీతో జాన్వీకపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
అయితే మెగాస్టార్ ఆచార్య సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న డైరెక్టర్ కొరటాల శివ.. దేవరతో మంచి హిట్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నాడు. దీంతో రిలీజ్‌కు ముందు కూడా మార్పులు చేస్తున్నట్లు ప్రచారం జరగుతోంది. ముఖ్యంగా మూడీ రన్‌టైమ్ విషయంలో దర్శకుడు కొరటాల శివ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు టాలీవుడ్‌లో టాక్.
దేవర సినిమా రన్‌టైమ్‌ను దాదాపు పదిహేను నిమిషాల పాటు తగ్గించినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. తొలుత దేవర మూవీని రెండు గంటల యాభై ఏడు నిమిషాల రన్‌టైమ్‌తో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. ఐతే, ఇటీవల రిలీజైన కొన్ని సినిమాలు మూడు గంటల రన్‌టైమ్‌తో రిలీజయ్యాయి. ఆ సినిమాల రన్‌టైమ్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి. ఆ విమర్శలను దృష్టిలో పెట్టుకొనే దేవర సినిమాను పదిహేను నిమిషాల పాటు మేకర్స్ తగ్గించినట్లు చెబుతున్నారు. రెండు గంటల నలభై రెండు నిమిషాల ఫైనల్ రన్‌టైమ్‌తో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది.
ఇలా రన్ టైమ్ తగ్గించడం కోసం సినిమాలో కొన్ని కామెడీ సీన్స్‌ను తొలగించడంతోపాటు ఎన్టీఆర్, జాన్వీకపూర్ లవ్ ట్రాక్ లెంగ్త్ తగ్గించినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే రిలీజై సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన దావూదీ సాంగ్ కూడా సినిమాలో ఉండదని, ఎండ్ టైటిల్స్ సమయంలో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసేలా ఈ సాంగ్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం.