NTR : ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ గుడ్ న్యూస్.. త్వరలోనే మనమందరం కలుసుకుందాం, మాట్లాడుకుందాం..
రాసి పెట్టుకోండి ఆఖరిగా వచ్చే 20 నిమిషాలు థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరుగుతాయి.

NTR : అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మనమందరం కలుసుకుందాం, మాట్లాడుకుందాం అని చెప్పారు. త్వరలోనే ఫ్యాన్స్ ని కలుస్తానని ఎన్టీఆర్ చెప్పారు. అయితే, అది ప్లాన్ చేయడానికి కొంత వ్యవధి కావాలని కోరాడు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ కచ్చితంగా అందరినీ అలరిస్తున్నాడని ఎన్టీఆర్ చెప్పాడు. కల్యాణ్ అన్న చాలా సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమా ఆయన కెరియర్ లో ఒక స్పెషల్ ఫిలిమ్ గా నిలిచిపోతుందనే నమ్మకం తనకుందన్నారు ఎన్టీఆర్. విజయశాంతిపై ప్రశంసల వర్షం కురిపించారు ఎన్టీఆర్. భారత దేశపు చిత్రపటంలో హీరోలతో ఈక్వల్ గా నిల్చున్న ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారా అంటే అది విజయశాంతి ఒక్కరే అని కితాబిచ్చారు.
”స్టేజ్ పైన నాన్న లేరనే లోటు తీరినట్లైంది విజయశాంతి మాట్లాడుతుంటే. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాన్న ఉంటే ఎలా ఉండేదో అది విజయశాంతి మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది. విజయశాంతి సాధించిన గొప్పదనం ఏ మహిళ సాధించలేదు. భారత దేశపు చిత్రపటంలో హీరోలతో ఈక్వల్ గా నిల్చున్న ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారా అంటే అది విజయశాంతి ఒక్కరే.
కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు.. ఆవిడ చేసి సినిమాలు చూస్తే.. మన దేశంలో వేరే ఏ హీరోయిన్ అన్ని పాత్రలు చేయలేదు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. కర్తవ్యంలో ఉండే ఆ పోలీస్ ఆఫీసర్ కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అక్కడి నుంచి మొదలై ఉండొచ్చు ఐడియా. చాలా ఆనందంగా ఉంది నాకు.
Also Read : ఖుష్బూ కూతురు చెప్పిన కొత్త సంగతి.. హీరోయిన్ గా లాంఛ్ చేయమ్మా అంటే ఖుష్బూ ఏమందంటే.
విజయశాంతి లేకపోతే ఈ సినిమా లేదు. ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చేశారు. 18వ తేదీన వస్తోంది. రాసి పెట్టుకోండి ఆఖరిగా వచ్చే 20 నిమిషాలు థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. డైరెక్టర్ ప్రదీప్ అలా మలిచారు సినిమాని. కల్యాణ్ అన్న చాలా సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమా ఆయన కెరియర్ లో ఒక స్పెషల్ ఫిలింగా నిలిచిపోతుందనేది నా నమ్మకం. మనసు పెట్టి, ప్రాణం పెట్టి పెర్ఫార్మ్ చేశాడు. విజయశాంతిని తల్లిగా నమ్మాడు అందుకే అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు.
18న అద్భుతమైన మూవీ రాబోతోంది. ఆగస్టు 14న వార్ 2 మూవీ రిలీజ్ కాబోతోంది. ఆ మూవీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది. కొంచెం ఎండలు తగ్గిన తర్వాత పకడ్బందీగా ప్లాన్ చేసి త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. చాలా కాలమైంది. త్వరలోనే కలుసుకుందాం. కానీ, కొంచెం ఓర్పు, సహనంతో ఉండండి. నందమూరి అభిమానులు అంటే ఓర్పు, సహనానికి మారుపేరు. త్వరలోనే మనం అందరం కలుసుకుందాం. మాట్లాడుకుందాం. ప్లాన్ చేయడానికి కొంత సమయం కావాలి. ఈ సంవత్సరం కచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను” అని ఎన్టీఆర్ అన్నారు.