NTR : వెకేషన్ నుంచి వచ్చేసిన ఎన్టీఆర్.. దేవర మొదలవుతుందా?

దేవర సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ దేవర సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి ఫ్యామిలీతో దుబాయ్ వెకేషన్ కి వెళ్లారు.

NTR : వెకేషన్ నుంచి వచ్చేసిన ఎన్టీఆర్.. దేవర మొదలవుతుందా?

Jr NTR Returns from Vacation will start Devara movie Shooting soon

Updated On : June 4, 2023 / 12:38 PM IST

Devara :  ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో దేవర(Devara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాని భారీగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్, ఈ సినిమా గురించి కొరటాల మాట్లాడిన దానితో దేవరపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

దేవర సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ దేవర సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి ఫ్యామిలీతో దుబాయ్ వెకేషన్ కి వెళ్లారు. దీంతో సినిమా షూటింగ్ లేట్ అవుతుందేమో అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ వారం రోజుల్లోనే ఎన్టీఆర్ తన వెకేషన్ నుంచి వచ్చేశారు. తాజాగా వెకేషన్ నుంచి తిరిగి రాగా ఎయిర్ పోర్ట్ లో బయటకు వస్తున్న ఎన్టీఆర్ ఫొటోలు వైరల్ గా మారాయి.

Rajinikanth Vs Chiranjeevi : ఇండిపెండెన్స్ డే బరిలో సూపర్ స్టార్ వర్సెస్ మెగా స్టార్.. ఏజ్ పెరిగినా తగ్గేదేలే..

ఎన్టీఆర్ తిరిగొచ్చేశాడు కదా దేవర షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి దేవర మూడో షెడ్యూల్ ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.