Jr NTR : బగీరా చనిపోయింది.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. ఫొటోలు వైరల్..
తాజాగా ఎన్టీఆర్ పెంపుడు కుక్క బగీరా మరణించింది.
Jr NTR
- తాజాగా ఎన్టీఆర్ పెంపుడుకుక్క బగీరా మరణించింది.
- ఎన్టీఆర్ ఇటీవల చేతికి శస్త్ర చికిత్స చేసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు.
- తాజాగా ఎన్టీఆర్ తన పెంపుడు కుక్క బగీరాతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
- తన పోస్ట్ లో ఎన్టీఆర్.. బగీరా.. నువ్వు నా ప్రపంచంలోకి ఒక తోడుగా వచ్చావు, నెమ్మదిగా నా కుటుంబంలో ఒకరిగా మారిపోయావు. ప్రేమ, విశ్వాసం, అల్లరి మరియు కేవలం నువ్వు మాత్రమే ఇవ్వగలిగే ఒక ప్రత్యేకమైన ఓదార్పుతో నా రోజులను నింపావు. నీ లేని లోటు సృష్టించిన నిశ్శబ్దం ఎంత పెద్దదో, నువ్వు మిగిల్చిన ప్రేమ కూడా అంతే గొప్పది. నన్ను ఎంచుకున్నందుకు, నా పక్కన నడిచినందుకు మరియు ఈ నాలుగేళ్లను ఎంతో అందంగా తీర్చిదిద్దినందుకు నీకు ధన్యవాదాలు. స్వేచ్ఛగా పరుగెత్తు, నా చిన్నారి. నిన్ను ఎంతో ప్రేమించాను, ఇకముందూ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఎమోషనల్ గా తెలిపారు.
- తన పెంపుడు కుక్కతో దిగిన ఫొటోలతో పాటు అది మరణించిన తర్వాత పూడ్చిపెట్టిన స్థలంలో ఒక మొక్క నాటిన ఫోటోని కూడా షేర్ చేసారు ఎన్టీఆర్.
- దీంతో ఎన్టీఆర్ తన పెంపుడు కుక్క చనిపోయిందని బాధలో ఉన్నాడని అభిమానులు జాగ్రత్త అంటూ, త్వరగా కోలుకొని రావాలని కామెంట్స్ చేస్తున్నారు.
- Jr NTR
