Jr Ntr
Jr NTR: ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ రెండున్నరేళ్ల సమయాన్ని వదిలేసుకున్నాడు. ఈ సినిమా తెచ్చే క్రేజ్ ముందు ఆ సమయం చాలా చిన్నదే అంటున్నారు ఆయన అభిమానులు. అయితే.. ఆ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేసేందుకు తారక్ ఇప్పుడు నాన్ స్టాప్ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం తన కెరీర్ లో 30వ సినిమాగా కొరటాల శివ సినిమాను మొదలు పెట్టేసిన తారక్ ఆ తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడని టాక్.
Amitabh Bachchan: మొట్టమొదటి సొంత ఇంటికి అమ్మేసిన అమితాబ్!
ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ తో పాటు బాలీవుడ్ దర్శకులు కూడా ఎన్టీఆర్ మూవీ లైనప్ లో ఉన్నారని ఇప్పటికే కథనాలు రాగా తాజాగా నెక్స్ట్ తారక్ చేయబోయే పది సినిమాలు టాప్ టెన్ దర్శకులతోనే ఉంటాయని.. ఈ దర్శకులతోనే ఎన్టీఆర్ 30 నుండి 40 సినిమాల వరకు ఉండనున్నాయని ఓ లిస్ట్ వైరల్ అవుతుంది.
Ranga Ranga Vaibhavanga ఫస్ట్ సింగిల్.. తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో!
ఒకసారి ఈ లిస్ట్ చూస్తే ఎన్టీఆర్ 31- బుచ్చిబాబు, ఎన్టీఆర్ 32 – ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 33 – అట్లీ
ఎన్టీఆర్ 34 – త్రివిక్రమ్ తో చేయనుండగా 35వ సినిమాని మైల్ స్టోన్ గా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో చేయనున్నాడట. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ 36 – వేట్రి మారన్, ఎన్టీఆర్ 37 – తరుణ్ భాస్కర్, ఎన్టీఆర్ 38 – సుకుమార్, ఎన్టీఆర్ 39 – లోకేష్ కనగరాజ్ తో కలిసి పనిచేయనుండగా.. ఎన్టీఆర్ 40 ల్యాండ్ మార్క్ మూవీగా మరోసారి రాజమౌళి తెరకెక్కించనున్నారని ఆ లిస్ట్ లో ఉంది. ఇది ఎంతవరకు నిజం.. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఎవరూ చెప్పలేరు కానీ.. ఇప్పుడు ఈ లిస్ట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.