Jr NTR : మూడు పండుగలకు మూడు సినిమాలు.. ఫుల్ స్పీడ్‌లో జూ.ఎన్టీఆర్
మూడు పండుగలకు మూడు సినిమాలను లైన్ లోనే పెట్టేశాడు ఎన్టీఆర్.

Junior NTR in full speed Three movies for three festivals
ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్లాన్ మామాలుగా లేదు కదా.. ప్యాన్స్ ని పండగల వేళ పలకరించేందుకు పెద్ద స్కెచ్ వేశాడు. ఈసారి థియేటర్లలో పండుగ చేసుకుందామంటూ ఫ్యాన్స్ కి హింట్ ఇస్తున్నాడు. ఇంతకీ ఎన్టీఆర్ ప్లాన్ ఏంటి?.. ఈసారి వచ్చే వెస్టివల్స్ లో ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడో చూద్దాం..
జూనియర్ ఎన్టీఆర్ ఈసారి తన ఫ్యూచర్ సినిమాలపై గట్టి ప్లాన్ తో వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ మూడేళ్లు డేట్స్ ఇచ్చేశారు. ఆర్ఆర్ఆర్ వచ్చిన చాలా గ్యాప్ తర్వాత దేవర వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అందుకు తగ్గట్టుగానే మూడు పండుగలకు మూడు సినిమాలను లైన్ లోనే పెట్టేశాడు ఎన్టీఆర్.
Ram Gopal Varma : ఆ కేసులో రాంగోపాల్ వర్మకు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇందులో వార్ 2 మూవీ చివరి దశలో ఉంది. హృతిక్ రోషన్ తో కలిసి చేయాల్సిన పాట షూట్ ఇటీవలే మొదలయ్యింది. ఇంకో వారం రోజుల్లో ఆ పాట కూడా కంప్లీట్ అవుతుంది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా దాదాపు పూర్తయినట్టే. ఈ సినిమాను ఇండిపెండెంట్ డే సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు.
ఎన్టీఆర్ చేస్తున్న మరో సినిమా డ్రాగన్. ప్రశాంత్ నీల్ డ్రాగన్ సెట్ లో ఏప్రిల్ నుంచి రెగ్యులర్ గా అందుబాటులో ఉండబోతున్నాడు ఎన్టీఆర్. ఈ ఏడాది నవంబర్ లోగా సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. 2026 సంక్రాంతి పండుగ రోజున విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనేది లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు మేకర్స్. దీంతో వచ్చే సంక్రాంతి బరిలోకి డ్రాగన్ రావడం గ్యారెంటీ అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
తారక్ చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ దేవర-2. ఈ మూవీని ఈ ఏడాది మే, జూన్ లో సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. దేవర ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ గా రిలీజై దాదాపు 500 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే ఈసారి సెకండ్ పార్ట్ బడ్జెట్ ని భారీగా పెంచబోతున్నారు. దేవర మొదటి పార్ట్ లో ఎన్నో చిక్కు ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానం రెండో పార్ట్ లో దొరికే అవకాశం ఉంది. ఈసారి విలన్ సైఫ్ అలీ ఖాన్ తో పాటు బాబీ డియోల్ కూడా చేరతాడనే ప్రచారం నిజమేనని తెలిసింది.
Court Trailer : నాని నిర్మాతగా.. ‘కోర్ట్’ సినిమా ట్రైలర్ రిలీజ్..
కాకపోతే క్యాస్టింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు లేవు. అటు జాన్వీ కపూర్ డేట్స్ కూడా ఇవ్వలేదు. అంతా సవ్యంగా అనుకున్నట్టు జరిగితే జనవరి కల్లా షూటింగ్ కప్లీంట్ చేసిన 2026 దసరాకి దేవర 2 ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ప్రస్తుతం కొరటాల తన టీంతో కలిసి ‘దేవర-2’ స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడట. జూన్ నాటికి స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యే అవకాశముంది అంటున్నారు. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుందట. మొత్తానికి ఎన్టీఆర్.. మూడు పండుగలకు మూడు పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్నాడన్నమాట.