Court Trailer : నాని నిర్మాతగా.. ‘కోర్ట్’ సినిమా ట్రైలర్ రిలీజ్..
ఇప్పటికే కోర్ట్ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Nani Priyadarshi Court Movie Trailer Released
Court Trailer : నాని ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూ తన వాల్ పోస్టర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాని కోర్ట్ అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రియదర్శి మెయిన్ లీడ్ లో హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మాణంలో రామ్ జగదీశ్ దర్శకత్వంలో ఈ కోర్ట్ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే కోర్ట్ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా కోర్ట్ ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ చూస్తుంటే.. ఓ యువకుడిపై పలు రకాల సెక్షన్స్ లో కేసులు, ఆఖరికి పోక్సో కేసు కూడా పెట్టి అరెస్ట్ చేస్తారు. అయితే అతను తప్పు చేయకుండా అక్రమంగా ఇరికించారు, అతన్ని కాపాడటానికి ఓ లాయర్ వచ్చి ఏం చేసాడు అనే కథాంశంతో ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా మార్చ్ 14న రిలీజ్ కానుంది.