దిశా నిందితుల ఎన్ కౌంటర్ : స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

దిశా నిందితుల ఎన్ కౌంటర్‌పై ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం ఉదయం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. JUSTICE SERVED! Now, Rest In Peace Disha అని వెల్లడించారు. ఈయనతో పాటు పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. పోలీసుల చర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ట్వీట్ చేశారు. Dandaalu saami..Meeru padhi kaalala paatu challagaa Undalayyaa అంటూ ట్వీట్ చేశారు. ఇతర రంగాలకు చెందిన వారు స్పందిస్తున్నారు. నిందితులకు కరెక్టు శిక్ష పడిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Read More : ఎన్ కౌంటర్ : దిశా కేసు..ఏ సమయానికి ఏం జరిగిందంటే
2019, నవంబర్ 27వ తేదీ బుధవారం దిశను దారుణంగా హత్యాచారం చేశారు. దారుణంగా కాల్చి చంపేశారు. షాద్ నగర్‌లో చోటు చేసుకుంది. మహ్మద్, జొల్లు శివ, చెన్న కేశవులు, నవీన్ కుమార్‌లుగా గుర్తించి వీరిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికాయి. ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దిశను దారుణంగా చంపేసిన నిందితులకు ఉరిశిక్ష వేయాలనే డిమాండ్స్ వినిపించాయి. తాజాగా ఎన్ కౌంటర్ జరగడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
JUSTICE SERVED! Now, Rest In Peace Disha.
— Jr NTR (@tarak9999) December 6, 2019
Dandaalu saami ??? Meeru padhi kaalala paatu challagaa Undalayyaa……. https://t.co/tqWWlLPAcn
— Harish Shankar .S (@harish2you) December 6, 2019