Akira Nandan : అకీరా నందన్‌తో ఉన్న ఫోటో షేర్ చేసిన రాఘవేంద్రరావు.. వెంటనే డెలీట్ చేశారు.. ఎందుకు..?

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ తో ఉన్న ఫోటోని షేర్ చేసిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు.. కొద్దిసేపటిలోనే ఆ ఫోటోని డెలీట్ చేశారు.

Akira Nandan : అకీరా నందన్‌తో ఉన్న ఫోటో షేర్ చేసిన రాఘవేంద్రరావు.. వెంటనే డెలీట్ చేశారు.. ఎందుకు..?

K Raghavendra Rao shares pic with Pawan Kalyan son Akira Nandan

Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ ఎంట్రీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా అండ్ పవన్ సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ కి కనిపించే అకీరా.. తన హైట్ అండ్ హ్యాండ్సమ్ లుక్స్ తో అందర్నీ ఆకర్షిస్తుంటారు. ఇక తన తండ్రి లాగానే మార్షల్ ఆర్ట్స్ చేసే కొన్ని వీడియోలతో పాటు, అకీరా జిమ్ చేసే వీడియోలను కూడా రేణూ దేశాయ్ (Renu Desai) తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంటారు.

Vijay Deverakonda : ఖుషి ప్రమోషన్స్‌లో రష్మిక గురించి విజయ్ ఇంటరెస్టింగ్ కామెంట్స్.. తనతో కలిసి..!

తాజాగా టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు (K Raghavendra Rao) అకీరాతో ఉన్న ఫోటోని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆ ఫొటోలో రాఘవేంద్రరావు మనవడు కార్తికేయ, అకీరా కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటో షేర్ చేస్తూ దర్శకేంద్రుడు ఇలా రాసుకొచ్చారు. కార్తికేయ అండ్ అకీరా యూఎస్ లోని ఫిలిం స్కూల్ జాయిన్ అవ్వబోతున్నారని తెలియజేశారు. అయితే ఈ పోస్ట్ ని రాఘవేంద్రరావు కొద్దిసేపటిలోనే డెలీట్ చేశారు. ఆయన ఎందుకు అలా చేశారని అన్నది తెలియలేదు గాని, అప్పటికే ఆ ఫోటో వైరల్ అవ్వడంతో పవన్ అభిమానులు సేవ్ చేసి రీ పోస్టులు చేశారు.

Samantha : చుట్టూ 10 మందికి పైగా బాడీగార్డ్‌లతో.. హాలీవుడ్ గడ్డపై సమంత స్టార్‌డమ్ చూశారా.. పిక్స్ వైరల్..

ఇక ఈ ఫొటోలో అకీరా బ్లాక్ సూట్ లో స్టైలిష్ లుక్ లో కనిపించి అదరగొడుతున్నాడు. ఇది చూసిన అభిమానులు.. నువ్వు కూడా ఒక గ్యాంగ్ స్టార్ సినిమాతో ఎంట్రీ ఇవ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ తో ఒకటి మాత్రమే కన్‌ఫార్మ్ అయ్యింది. త్వరలోనే అకీరా నందన్ వెండితెర అరంగేట్రం ఉండబోతుంది. పవన్ ఫ్యాన్స్ జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ కోసం రెడీగా ఉండండి.

K Raghavendra Rao shares pic with Pawan Kalyan son Akira Nandan

K Raghavendra Rao shares pic with Pawan Kalyan son Akira Nandan