Kabzaa: సీక్వెల్ షురూ చేసిన పాన్ ఇండియా మూవీ.. ఈసారి ఏమవుతుందో?
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన కబ్జ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ మూవీని స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.

Kabzaa Movie Sequel Starts Shooting
Kabzaa: కన్నడ హీరో ఉపేంద్ర నటించిన రీసెంట్ మూవీ కబ్జ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఉపేంద్రతో పాటు మరో స్టార్ హీరో సుదీప్ కూడా నటించారు. ఇక ఈ సినిమాను దర్శకుడు చంద్రు డైరెక్ట్ చేయగా, పీరియాడిక్ మూవీగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించింది చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంలో సక్సెస్ అయ్యింది.
Kabzaa Movie: ఓటీటీ డేల్ లాక్ చేసుకున్న కబ్జ.. ఎప్పుడంటే..?
పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కాగా, ఈ సినిమాను కన్నడతో పాటు మిగతా భాషల్లోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ఉపేంద్ర అభిమానులతో పాటు కన్నడ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. అయితే, తాజాగా ఈ సీక్వెల్ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది.
Kabzaa : కబ్జ సక్సెస్ మీట్ గ్యాలరీ..
కబ్జ 2 మూవీని ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సీక్వెల్ మూవీని కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ కూడా ఓ కేమియో పాత్రలో నటిస్తున్నారు. అందాల భామ శ్రియా సరన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా, కేజీయఫ్ ఫేం రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి కబ్జ-2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.