Kaikala Sathyanarayana : కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం.. అపోలోలో చికిత్స
ఆయన ఇటీవల తన ఇంట్లో జారిపడ్డారు. కింద పడడం వలన నొప్పులు కాస్త ఎక్కువగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించి వైద్యం అందించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి

Kaikala
Kaikala Sathyanarayana : దాదాపు 60 సంవత్సరాలకు పైగా ప్రేక్షకులని విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించారు కైకాల సత్యనారాయణ. వయోభారంతో గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. సినిమాలకి దూరంగా ఉన్నా సినిమా వాళ్ళతో మాత్రం పరిచయాలు కొనసాగిస్తున్నారు. సినీ ప్రముఖులు కైకాల సత్యనారాయణని అప్పుడప్పుడు పలకరిస్తున్నారు.
Rashmika : మెక్ డొనాల్డ్స్ నుంచి ‘రష్మిక మీల్స్’.. మీరు కూడా ఆర్డర్ ఇచ్చేయండి
ఆయన ఇటీవల తన ఇంట్లో జారిపడ్డారు. కింద పడడం వలన నొప్పులు కాస్త ఎక్కువగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించి వైద్యం అందించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. తాజాగా కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం అయన ఆరోగ్య పరిస్థితి విషమం అనిపించడంతో కుటుంబ సభ్యులు ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నారు.