Ghost Movie : కింగ్ పక్కన కాజల్ బదులు జాక్వెలిన్..

కింగ్ నాగార్జున నటిస్తున్న ‘ఘోస్ట్’ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ తప్పుకుంది..

Ghost Movie : కింగ్ పక్కన కాజల్ బదులు జాక్వెలిన్..

Jacqueline Fernandez

Updated On : September 25, 2021 / 5:56 PM IST

Ghost Movie: కింగ్ నాగార్జున సూపర్ స్పీడ్ మీదున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ ఓ స్లిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి ‘ఘోస్ట్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చెయ్యగా అదరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Love Story : ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమా ‘లవ్ స్టోరీ’..

ఈ మూవీలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. అయితే ఇప్పుడు ఏవో కారణాలతో కాజల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఆమె ప్లేస్‌లోకి శ్రీలంకన్ యాక్ట్రెస్, బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకున్నారట మేకర్స్. ‘సాహో’ లో స్పెషల్ సాంగ్ ద్వారా తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది జాక్వెలిన్.

Rana Daggubati : రానా రేంజ్ పెరిగింది.. అందుకే అన్ని కోట్లు..

ఈ సినిమాను నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ‘ఘోస్ట్’ సెట్స్ మీద ఉండగానే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ మూవీని కూడా స్టార్ట్ చేసేశారు నాగార్జున. ఇందులో తనయుడు నాగ చైతన్యతో కలిసి నటించబోతున్నారు. చైతుకి జోడీగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి కనిపించనుంది. ‌

Bangarraju : ‘బంగార్రాజు’ స్టార్ట్ అయ్యాడు.. ఆనందంలో అక్కినేని అభిమానులు..