Love Story : ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమా ‘లవ్ స్టోరీ’..

నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ యూఎస్ ప్రీమియర్స్‌లో అరుదైన ఘనత సాధించింది..

Love Story : ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమా ‘లవ్ స్టోరీ’..

Love Story Usa Premiers

Updated On : September 25, 2021 / 4:10 PM IST

Love Story: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరి’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. సంస్థలు నిర్మించాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లవ్ స్టోరో’ మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

కోవిడ్ ఎఫెక్ట్.. రిలీజ్ పలుసార్లు వాయిదా.. ఓటీటీలో రిలీజ్ అంటూ వార్తలు.. ఎన్నో అడ్డంకులను దాటి సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘లవ్ స్టోరీ’.. పాండమిక్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్‌లోనూ భారీ అంచనాల మధ్య థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Prema Nagar : చరిత్ర సృష్టించిన ప్రేమకథకు 50 ఏళ్లు..

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది ‘లవ్ స్టోరీ’.. అక్కడ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 2021లో యూఎస్ఎ ప్రీమియర్స్‌లో హయ్యస్ట్ గ్రాస్ సాధించిన ఇండియన్ ఫిలింగా ‘లవ్ స్టోరీ’ టాప్ ప్లేస్‌లో నిలిచింది. రిలీజ్ చేసిన అన్ని లొకేషన్లలోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది.

Love Story : జాతరను తలపిస్తున్న థియేటర్లు..