Kajal Aggarwal : కాజల్ కంబ్యాక్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది.. చేతిలో అరడజను ప్రాజెక్టులు..

కాజల్ ఇప్పుడు గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఆల్రెడీ ఇటీవల కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నాను అని తానే ప్రకటించింది. అలాగే కాజల్ ఇప్పటికే నటించిన తమిళ్ సినిమా....................

Kajal Aggarwal : కాజల్ కంబ్యాక్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది.. చేతిలో అరడజను ప్రాజెక్టులు..

Kajal Aggarwal grand comeback in telugu and tamil movies

Updated On : March 4, 2023 / 10:16 AM IST

Kajal Aggarwal :  కాజల్ అగర్వాల్ 2007లో లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ మధ్యలో కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా చేసింది కాజల్. కరోనా సమయంలో సడెన్ గా ఓ బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. అప్పట్నుంచి సినిమాలకు దూరమైంది కాజల్. పెళ్లి, ఆ తర్వాత బాబు పుట్టడంతో ఇన్ని రోజులు సినిమాలకు దూరంగానే ఉంది. చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా వదిలేసుకుంది.

 

కానీ కాజల్ ఇప్పుడు గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఆల్రెడీ ఇటీవల కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నాను అని తానే ప్రకటించింది. అలాగే కాజల్ ఇప్పటికే నటించిన తమిళ్ సినిమా పారిస్ పారిస్ రిలీజ్ కి రెడీగా ఉంది. కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. వీటితో పాటు కరుంగాపియం, ఘోస్టీ అనే మరో రెండు తమిళ సినిమాలు కాజల్ ఇటీవలే ఒప్పుకుంది. అలాగే బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమాలో కూడా కాజల్ ని తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా ఇప్పటికే కాజల్ కంబ్యాక్ లో అయిదు సినిమాలు చేతిలో ఉండగా మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి.

Rana Daggubati : ప్రభాస్, మహేష్ బాబు ఎవరో బాలీవుడ్ వాళ్లకు తెలీదంట.. రానా సంచలన వ్యాఖ్యలు..

కాజల్ కంబ్యాక్ లో ఒక్క సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించినా మళ్ళీ కాజల్ కి వరుస ఆఫర్స్ గ్యారెంటీ. మరి కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకోబోతుందో చూడాలి. కాజల్ కంబ్యాక్ ఇస్తుండటంతో కాజల్ అభిమానులు సంతోషిస్తున్నారు.