హీరోయిన్ సంయుక్తకు కాజల్ మద్దతు: పార్కులో బ్రా గొడవ, అమ్మాయిలు ఏం వేసుకోవాలో వాళ్ళ‌కు తెలుసు

  • Published By: naveen ,Published On : September 7, 2020 / 01:58 PM IST
హీరోయిన్ సంయుక్తకు కాజల్ మద్దతు: పార్కులో బ్రా గొడవ, అమ్మాయిలు ఏం వేసుకోవాలో వాళ్ళ‌కు తెలుసు

Updated On : September 7, 2020 / 2:55 PM IST

Kannada actress Samyuktha Hegde sports bra Issue: కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే బెంగళూరులోని ఓ పార్క్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని త‌న స్నేహితురాలితో వర్కౌట్లు చేయడం, సంయుక్తపై కవితా రెడ్డి అనే మహిళ దాడి చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లో ఇలాంటి బ‌ట్టలు వేసుకొని తిరుగుతారా అంటూ క‌వితా రెడ్డి.. సంయుక్త‌తో పాటు ఆమె స్నేహితురాలిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ వ్య‌వ‌హారాన్నంతా రికార్డ్ చేసిన సంయుక్త త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ న్యాయం చేయాల‌ని కోరింది. ఈ ఘటనపై రచ్చ కంటిన్యూ అవుతోంది. కొందరు సంయుక్తను సపోర్ట్ చేస్తే మరికొందరు కవితారెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు.



అమ్మాయిలు ఏం వేసుకోవాలో వాళ్ళ‌కు తెలుసు:
ఈ ఘ‌ట‌నపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తూ సంయుక్త‌కు త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న స్పందన తెలిపారు. ఓరి దేవుడా సామ్! ఇలా జ‌రిగిందంటే నమ్మేలేక‌పోతున్నా. క‌వితా రెడ్డి గారు మీ కోపానికి గ‌ల కార‌ణం ఏంటో తెలుసుకొని ప‌రిష్క‌రించుకోవాలి. మీ ఫ్ర‌స్ట్రేష‌న్‌, కోపం ఎక్క‌డి నుండి వ‌చ్చిందో తెలుసుకోవాలి. అన్నింటికి మించి అమ్మాయిలు ఏం వేసుకోవాలో వాళ్ళ‌కు తెలుసు. ఎదుటివారి గురించి పట్టించుకోవడం మాని మన పని మనం చూసుకుంటే మంచిది’’ అని ట్వీట్ చేసింది కాజల్ అగర్వాల్.


ప‌బ్లిక్‌లో బ్రా వేసుకుని తిరుగుతావా? టాప్ చూపిస్తావా?
శుక్ర‌వారం(సెప్టెంబర్ 4,2020) వ‌ర్క‌వుట్లు చేసేందుకు తన స్నేహితుల‌తో క‌లిసి హీరోయిన్ సంయుక్త బెంగ‌ళూరులోని ఓ పార్క్‌కు వెళ్లింది. స్పోర్ట్స్ బ్రా వేసుకుని వ‌ర్క‌వుట్స్ చేస్తోంది. అయితే ఆ స‌మయంలో అక్క‌డే ఉన్న క‌వితా రెడ్డి అనే మ‌హిళ సంయుక్త‌ను తప్పు పట్టింది. సంయుక్త దుస్తుల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. స్పోర్ట్స్ దుస్తులు ధ‌రించి ప‌బ్లిక్‌లోకి ఎలా వ‌స్తావంటూ దూష‌ణ‌ల‌కు దిగింది. పార్కులో ఉన్న మ‌రికొంద‌రు కూడా స‌ద‌రు మ‌హిళ‌తో క‌లిసి సంయుక్త‌తోపాటు ఆమె స్నేహితుల‌పై దాడి చేశారు. ప‌బ్లిక్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని తిర‌గ‌డంతో పాటు మీ లాంటి నటులంతా డ్ర‌గ్స్ వాడతారంటూ ఆమెని తిట్టిపోశారు. ఈ ఘ‌ట‌న‌తో షాక్ తిన్న హీరోయిన్ సంయుక్త, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌న‌కు జ‌రిగిన చేదు అనుభ‌వాన్ని వెల్ల‌డించారు.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) on

కోపంతో ఊగిపోయిన సంయుక్త ఓ సెల్ఫీ వీడియోలో అసలు విషయం చెబుతూ ఫైర్ అయింది. తాను వర్కవుట్ చేయడానికి వేసుకున్న లో- దుస్తులను పబ్లిక్‌‌గానే టాప్ తీసి చూపిస్తూ రెచ్చిపోయింది. దాడి చేసిన మహిళతో పాటు ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకే కొందరు ఈ ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన చెందింది. దీంతో ఆమె పోస్ట్ చేసిన ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) on

తెలుగులో నాగార్జున‌తో మ‌న్మ‌థుడు 2 మూవీ, యంగ్ హీరో నిఖిల్‌తో కిర్రాక్ పార్టీ వంటి చిత్రాల‌తో పాటు ప‌లు త‌మిళ సినిమాల్లో నటించి ఫేమ్ సంపాదించింది సంయుక్త హెగ్డే.