Anudeep Katikala Arrest: పవన్, నిహారికపై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండ్-అప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్
Anudeep Katikala Aressted: అనుదీప్ కటికాల(Anudeep Arrest)ను అదుపులోకి తీసుకున్న కాకినాడ పోలీసులు.
Kakinada Police Arrest Stand-up Comedian Anudeep
- పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు
- కామెడీ పేరుతో నోరు పారేసుకున్న కమెడియన్ అనుదీప్
- ప్రయాగ్‌రాజ్‌లో దొరికిన అనుదీప్
Anudeep Katikala Arrest: కామెడీ పేరుతో హద్దులు దాటి ప్రవర్తించే వారికి స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల(Anudeep Arrest) అరెస్ట్ ఒక హెచ్చరికగా నిలిచింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఉపాసన, నిహారికలపై ఇతను చేసిన వ్యక్తిగత, అనుచిత వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపాయి. అభిమానుల ఆగ్రహానికి గురైన అనుదీప్, ఆ తర్వాత క్షమాపణలు చెప్పినప్పటికీ జనసేన నాయకులు చట్టపరమైన చర్యలకే మొగ్గు చూపారు. ఇలాంటి ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే కఠిన శిక్ష పడాల్సిందేనన్న డిమాండ్లు బలంగా వినిపించాయి.
*‘బరి’ మూవీ సెట్స్ లో ప్రమాదం.. వరుణ్ తేజ్ కి గాయాలు
ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కాకినాడ పోలీసులు నిందితుడి కదలికలను గమనించారు. ప్రయాగ్‌రాజ్‌లో తన తండ్రితో కలిసి ఉన్న సమయంలో మొబైల్ లొకేషన్ ఆధారంగా అనుదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలపై కూడా ఇతను నీచమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. పోలీసులు అతడిని కాకినాడకు తరలించి తదుపరి విచారణను వేగవంతం చేశారు.
ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చేసే ప్రసంగాలు కామెడీ కాదని, అవి నేరాల కిందకు వస్తాయని ఈ అరెస్ట్ ద్వారా స్పష్టమైంది. గతంలో అనేకమంది సెలబ్రిటీలపై నోరు పారేసుకున్న అనుదీప్ తీరుపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఘటన నిరూపించింది.
