Kalanithi Maran gifted cheque and BMW car to Rajinikanth for Jailer success
Jailer : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ‘జైలర్’ మూవీ రికార్డ్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 10న రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ మూవీ 625 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ చిత్రం ఇంతటి విజయం అందుకోవడంతో మూవీ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఫుల్ హ్యాపీలో ఉన్నాడు.
Gautam Ghattamaneni : బర్త్ డేని గొప్పగా జరుపుకున్న గౌతమ్.. హ్యాట్సాఫ్ అంటున్న అభిమానులు..
#Jailer WW Box Office
ZOOMS past ₹6⃣2⃣5⃣ cr milestone mark in just 22 days.
Now the RACE begins toward ₹650 cr club.
||#600CrJailer|#Rajinikanth #ShivaRajKumar | #Mohanlal||
Week 1 – ₹ 450.80 cr
Week 2 – ₹ 124.18 cr
Week 3 – ₹ 47.05 cr
Week 4
Day 1 – ₹ 3.92 cr
Total -… pic.twitter.com/pgWoEnenK7— Manobala Vijayabalan (@ManobalaV) September 1, 2023
ఈ ఆనందంతో రజినీకాంత్ కి వచ్చిన ప్రాఫిట్స్ నుంచి కొంత అమౌంట్ ని చెక్ గా అందజేశాడు. అలాగే రెండు కొత్త BMW కార్లను తీసుకొచ్చి.. వాటిలో ఏది నచ్చిందో అది తీసుకోమని ఆఫర్ చేశాడు. BMW i7 – రూ.1.95 కోట్లు, BMW x7 – రూ.1.24 కోట్లు. ఈ రెండు మోడల్స్ రజినీకాంత్ BMW x7 ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక నిర్మాత చెక్ తో పాటు కార్ కీని అందజేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రొడ్యూసర్.. సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. రజిని ఎంపిక చేసుకున్న ఆ కారు వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
Sapthami Gowda : తమ్ముడు సినిమాలో నితిన్‌కి జోడిగా కాంతార భామ సప్తమి..
BMW i7 – ₹ 1.95 cr
BMW x7 – ₹ 1.24 cr
Superstar #Rajinikanth chose bmw x7.
[Ex Show Room Price]
||#Jailer | #600CrJailer|| pic.twitter.com/F283y5XurH
— Manobala Vijayabalan (@ManobalaV) September 1, 2023
కాగా ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీలో రమ్యకృష్ణ, తమన్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) కీలక పాత్రలు చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించగా మూవీకి హైలైట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్.. ఇటీవల ఒక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశాడు. దీంతో తలైవా అభిమానులు పుల్ హ్యాపీగా ఉన్నారు.
#JailerSuccessCelebrations continue! Superstar @rajinikanth was shown various car models and Mr.Kalanithi Maran presented the key to a brand new BMW X7 which Superstar chose. pic.twitter.com/tI5BvqlRor
— Sun Pictures (@sunpictures) September 1, 2023