Kaliyugam Pattanamlo : రిలీజ్ అయి ఆగిపోయిన సినిమా.. ‘కలియుగం పట్టణంలో’.. త్వరలో మళ్ళీ రిలీజ్..

కలియుగం పట్టణంలో సినిమా థ్రిల్లర్ సబ్జెక్టుతో మదర్ సెంటిమెంట్, ఓ మంచి మెసేజ్ తో ఆసక్తిగానే అనిపించింది.

Kaliyugam Pattanamlo : రిలీజ్ అయి ఆగిపోయిన సినిమా.. ‘కలియుగం పట్టణంలో’.. త్వరలో మళ్ళీ రిలీజ్..

Kaliyugam Pattanamlo Movie Postponed after Release

Updated On : March 30, 2024 / 10:45 AM IST

Kaliyugam Pattanamlo : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా చిత్రశుక్ల ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘కలియుగం పట్టణంలో’. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్ పై రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కలియుగం పట్టణంలో సినిమా నిన్న మార్చి 29న విడుదలైంది.

Also Read : Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ షూట్ గ్యాప్.. రైమ్‌తో కలిసి వెకేషన్ కి రామ్ చరణ్..

కలియుగం పట్టణంలో సినిమా థ్రిల్లర్ సబ్జెక్టుతో మదర్ సెంటిమెంట్, ఓ మంచి మెసేజ్ తో ఆసక్తిగానే అనిపించింది. మూడు కథలని తీసుకొని వాటిని ఒకదానికొకటి లింక్ ఇచ్చి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం సినిమా రిలీజ్ ఆపుతున్నామని, త్వరలోనే మళ్ళీ రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ తెలిపారు. అయితే ఆ కారణాలు ఏంటి అనేది చిత్రయూనిట్ ప్రకటించలేదు. త్వరలోనే మరో మంచి డేట్ అనౌన్స్ చేసి రిలీజ్ చేస్తామని తెలిపారు.