Kalki 2898 AD : ప్రభాస్ కల్కి సినిమాకు VFX చేస్తున్న సంస్థపై.. కేసు నమోదు చేసిన చిత్రయూనిట్ ?

సంక్రాంతికి రిలీజ్ చేస్తా అని చెప్పినా పోస్టు ప్రొడక్షన్ పనులు అవ్వకపోవడంతో సినిమా రిలీజ్ ని వాయిదా వేశారు. కల్కి సినిమాకు ఓ హాలీవుడ్ కంపెనీ VFX వర్క్స్ చేస్తుంది.

Kalki 2898 AD : ప్రభాస్ కల్కి సినిమాకు VFX చేస్తున్న సంస్థపై.. కేసు నమోదు చేసిన చిత్రయూనిట్ ?

Kalki Movie unit filed a case on VFX Company who worked for Movie for leaking photo

Updated On : September 17, 2023 / 12:42 PM IST

Kalki 2898 AD :  ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతి మూవీ బ్యానర్ పై దాదాపు 500 కోట్లతో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 AD’(ప్రాజెక్ట్ K). ఇటీవలే హాలీవుడ్(Hollywood) లోని కామిక్ కాన్(Comic Con)ఈవెంట్లో ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమా పై భారీ అంచనాలు పెంచారు. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

సంక్రాంతికి రిలీజ్ చేస్తా అని చెప్పినా పోస్టు ప్రొడక్షన్ పనులు అవ్వకపోవడంతో సినిమా రిలీజ్ ని వాయిదా వేశారు. కల్కి సినిమాకు ఓ హాలీవుడ్ కంపెనీ VFX వర్క్స్ చేస్తుంది. అయితే ఇటీవల కల్కి సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్ ఒకటి లీక్ అయింది. ఇది VFX వర్క్స్ నుంచే వచ్చిందని, ఆ కంపెనీలో పనిచేసేవాళ్ళే ఎవరో లీక్ చేశారని వార్తలు వచ్చాయి.

SIIMA Awards Tamil : సైమా అవార్డుల్లో.. విక్రమ్ వర్సెస్ పొన్నియిన్ సెల్వన్ 1.. ఎవరికి ఎన్ని??

కల్కి చిత్రయూనిట్ సైబర్ టీం సహాయంతో లీక్ అయిన ఫోటోని ఇంటర్నెట్ నుంచి తీయించేసినట్టు సమాచారం. తాజాగా దీనిపై మరో వార్త వైరల్ గా మారింది. కల్కి చిత్రయూనిట్ ఫోటో లీక్ చేసినందుకు ఆ VFX కంపెనీపై నష్టపరిహారం కేసు వేసిందని సమాచారం. దీనిపై అధికారికంగా చిత్రయూనిట్ స్పందించకపోయినా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.