SIIMA Awards Tamil : సైమా అవార్డుల్లో.. విక్రమ్ వర్సెస్ పొన్నియిన్ సెల్వన్ 1.. ఎవరికి ఎన్ని??
తెలుగు అవార్డుల్లో RRR, సీతారామం సినిమాలు తమ హవా చూపించగా తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 1(Ponniyin Selvan 1), విక్రమ్(Vikram) సినిమాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి.

SIIMA Awards Tamil 2023 Vikram Vs Ponniyin Selvan 1 Movies Awards list
SIIMA Awards Tamil 2023 : సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుకలు గత రెండు రోజులు దుబాయ్ లో ఘనంగా జరిగాయి. రెండు రోజుల పాటు సెప్టెంబర్ 15న తెలుగు, కన్నడ అవార్డుల వేడుక జరగగా.. నిన్న సెప్టెంబర్ 16న తమిళ్, మలయాళం సినీ పరిశ్రమల అవార్డు వేడుక జరిగింది. దుబాయ్(Dubai) లో గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్లో అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఇక తెలుగు అవార్డుల్లో RRR, సీతారామం సినిమాలు తమ హవా చూపించగా తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 1(Ponniyin Selvan 1), విక్రమ్(Vikram) సినిమాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. సగం కేటగిరీల్లో ఈ రెండు సినిమాలే అవార్డులు గెలుచుకున్నాయి.
పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా – ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి(త్రిష), ఉత్తమ సినిమాటోగ్రాఫర్(రవి వర్మన్), ఉత్తమ గేయ రచయిత(ఇలంగో కృష్ణన్), ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్(తోట తరణి) అవార్డులు గెలుచుకుంది. సినిమా దర్శకుడు మణిరత్నం ఎక్స్ట్రార్డినరీ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.
SIIMA 2023 Tamil : సైమా అవార్డ్స్ 2023 తమిళ్ పూర్తి లిస్ట్.. కమల్, త్రిష, కీర్తి సురేష్..
ఇక కమల్ హాసన్ చాలా సంవత్సరాల తర్వాత విక్రమ్ సినిమాతో భారీ విజయం సాధించి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. సైమా అవార్డుల్లో విక్రమ్ సినిమా.. ఉత్తమ దర్శకుడు(లోకేష్ కనగరాజ్), ఉత్తమ నటుడు(కమల్ హాసన్), ఉత్తమ సంగీత దర్శకుడు(అనిరుద్), ఉత్తమ సహాయ నటి(వాసంతి), ఉత్తమ గాయకుడు(కమల్ హాసన్) అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ గాయకుడు రెండు అవార్డులు విక్రమ్ సినిమాకు కమల్ హాసన్ అందుకోవడం విశేషం.