Kalyan Ram : ‘అమిగోస్’లో త్రిపాత్రాభినయం చేయబోతున్న కళ్యాణ్ రామ్?
నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' ఇచ్చిన సక్సెస్‌తో సినిమాల విషయంలో వేగం పెంచేశాడు. ఏక కాలంలో రెండు సినిమాలను చిత్రీకరిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ నందమూరి హీరో ప్రస్తుతం 'డెవిల్' అనే ఒక పీరియాడిక్ మూవీతో పాటు 'అమిగోస్' అనే యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు. బింబిసార సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రంలో త్రిపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తుంది.

Kalyan Ram is going to play a triple role in Amigos
Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ఇచ్చిన సక్సెస్‌తో సినిమాల విషయంలో వేగం పెంచేశాడు. ఏక కాలంలో రెండు సినిమాలను చిత్రీకరిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ నందమూరి హీరో ప్రస్తుతం ‘డెవిల్’ అనే ఒక పీరియాడిక్ మూవీతో పాటు ‘అమిగోస్’ అనే యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు. బింబిసార సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రంలో త్రిపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తుంది.
Kalyan Ram : స్పీడ్ పెంచేసిన కళ్యాణ్ రామ్.. తమిళనాడులో ‘డెవిల్’..
కాగా ఇటీవల ‘సిద్దార్ధ్ – డొప్పెల్‌గ్యాంగర్ 1’ అంటూ సినిమాలోనే కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ని పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఇవాళ ‘మంజునాథ్ – డొప్పెల్‌గ్యాంగర్ 2’ అంటూ మరో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ డొప్పెల్‌గ్యాంగర్ అంటే ఏంటో తెలియక గూగుల్ చేస్తున్నారు అభిమానులు. దీంతో మేకర్స్ ‘డొప్పెల్‌గ్యాంగర్’ అంటే ఏంటో ప్రేక్షకులకు తెలియజేసింది.
డొప్పెల్‌గ్యాంగర్ అంటే ‘మనిషిని పోలిన మనుషులు’ అని అర్ధం అంటూ చెబుతూ.. మూడో డొప్పెల్‌గ్యాంగర్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అంటూ ట్వీట్ చేశారు చిత్ర నిర్మాతలు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. రాజేంద్ర రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ మూవీ టీజర్ ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలియజేశారు మేకర్స్.
Here’s the meaning of ‘Doppelganger’
Stay tuned to meet the Doppelganger 3 from #Amigos ?
Teaser soon ?
In cinemas Feb 10th @NANDAMURIKALYAN @AshikaRanganath #RajendraReddy @GhibranOfficial @saregamasouth pic.twitter.com/7APhoRKYNQ
— Mythri Movie Makers (@MythriOfficial) January 3, 2023