Kalyan Ram : స్పీడ్ పెంచేసిన కళ్యాణ్ రామ్.. తమిళనాడులో ‘డెవిల్’..

నందమూరి కళ్యాణ్ రామ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయిస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ మూవీ. ఇక ఈ మూవీ ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ ప్రాజెక్టులు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే...

Kalyan Ram : స్పీడ్ పెంచేసిన కళ్యాణ్ రామ్.. తమిళనాడులో ‘డెవిల్’..

Kalyan Ram speed up the Devil movie shooting

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. సోషియో ఫాంటసీని, టైమ్ ట్రావెల్ ని జత చేస్తూ దర్శకుడు వసిష్ఠ తీసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయిస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ మూవీ. ఇక ఈ మూవీ ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ ప్రాజెక్టులు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

Kalyan Ram : ఫిబ్రవరికి రెడీ అయిపోయిన కళ్యాణ్ రామ్.. ‘అమిగోస్’ అంటూ ఈసారి ట్రిపుల్ రోల్‌లో..

ఈ క్రమంలోనే ‘డెవిల్’ అనే సినిమాని ప్రకటిచగా, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. నవీన్ మేడారం దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో కళ్యాణ్ రామ్ ఒక ‘బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’గా కనిపించబోతున్నాడు. సినిమా కథ 1945 బ్రిటిష్ కాలంలో జరిగిన రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా ఉండబోతుందట. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించడంతో పాటు అంచనాలు కూడా పెంచేసింది.

తాజాగా ఈ సినిమా చిత్రీకరణ విషయంలో స్పీడ్ పెంచేసాడు కళ్యాణ్ రామ్. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు తమిళనాడులోని కారైకుడికి చిత్ర యూనిట్ వెళ్ళింది. అక్కడే 20 రోజులు పాటు ఈ షెడ్యూల్ జరగనుందట. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చేసే సాహసాలు మూవీకే హైలైట్ కానున్నాయి అని చెబుతున్నారు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్తానికి హర్షవర్ధన్ రామేశవార్ సంగీతం అందిస్తున్నాడు.