Kalyan Ram : ఫిబ్రవరికి రెడీ అయిపోయిన కళ్యాణ్ రామ్.. ‘అమిగోస్’ అంటూ ఈసారి ట్రిపుల్ రోల్‌లో..

బింబిసార తర్వాత ఇప్పుడు మరో సినిమాతో రానున్నారు. బింబిసారలో డ్యూయల్ రోల్ లో అదరగొడితే ఈ సారి ట్రిపుల్ రోల్ తో రానున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో...................

Kalyan Ram : ఫిబ్రవరికి రెడీ అయిపోయిన కళ్యాణ్ రామ్.. ‘అమిగోస్’ అంటూ ఈసారి ట్రిపుల్ రోల్‌లో..

Kalyan Ram next movie amigos ready to release in febraury

Kalyan Ram :  నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవలే బింబిసార సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు కళ్యాణ్ రామ్ కెరీర్ కి మళ్ళీ బూస్ట్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు. త్వరలో ఈ సినిమా పార్ట్ 2 కూడా మొదలుపెడతారు. మరోపక్క కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో ఫామ్ లోకి వచ్చారు.

బింబిసార తర్వాత ఇప్పుడు మరో సినిమాతో రానున్నారు. బింబిసారలో డ్యూయల్ రోల్ లో అదరగొడితే ఈ సారి ట్రిపుల్ రోల్ తో రానున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. అమిగోస్ అనే డిఫరెంట్ టైటిల్ తో కళ్యాణ్ రామ్ రాబోతున్నాడు. అలాగే సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు.

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ 1500 ఎపిసోడ్స్ సెలబ్రేషన్

అమిగోస్ సినిమాని 10 ఫిబ్రవరి 2023న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ పై కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ పాత్రలని పెట్టి.. ”నీలాంటి వాళ్ళని ఇంకొకరిని చూస్తే నువ్వు చచ్చిపోతావని వాళ్ళు చెప్పారు” అనే కొటేషన్ ని ఇంగ్లీష్ లో పెట్టారు. దీంతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో ఈ సారి మరో కొత్త కథతో కళ్యాణ్ రామ్ రాబోతున్నాడని ఇప్పట్నుంచే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.