Kalyanji Gogana New Movie Poster and Title
Kalyanji Gogana: నాటకం, సుందరి, తీస్ మార్ ఖాన్ వంటి సినిమాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. భిన్న చిత్రాలు, విభిన్నమైన జానర్లలో సినిమాలు తీస్తూ ఆడియెన్స్‌ను అలరించడంతో కళ్యాణ్ జీ గోగణ తన మార్క్ వేశారు. మాస్ కమర్షియల్ సినిమా అంటూ తీస్ మార్ ఖాన్‌తో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన దర్వకత్వంలో మరో కొత్త చిత్రం రాబోతోంది.
Tees Maar Khan Trailer: తీస్‌మార్ ఖాన్ ట్రైలర్.. ఆది గట్టిగానే కొట్టేలా ఉన్నాడు!
నవయుగ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రాబోతోన్న ఈ చిత్రానికి కళింగరాజు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రవికుమార్ , ఐ. రవి కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నేహా సింగ్ సమర్పకురాలిగా, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఖుషీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నటుడు ఈ చిత్రంలో హీరోగా నటించబోతోన్నారు. ఈ సినిమాకు శేఖర్ నీలోజి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేయనున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఎన్నో వందల చిత్రాలకు పని చేసిన చోటా కే ప్రసాద్ ఈ సినిమాకు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. తీస్ మార్ ఖాన్ వంటి కమర్షియల్ సినిమాకు తన ఫోటోగ్రఫీతో మెప్పించిన బాల్ రెడ్డి.. ఈ సినిమాకు కెమెరామెన్‌గా పని చేయనున్నారు. ప్రస్తుత సంగీత దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పర్చుకున్న సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రయూనిట్ ప్రకటించనుంది.