Kamal Haasan : కల్కి రిలీజ్ తర్వాత హైదరాబాద్‌కి కమల్ హాసన్.. గ్రాండ్‌గా భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్..
కల్కి రిలీజయిన తర్వాత కమల్ హాసన్ మొదటిసారి హైదరాబాద్ కి రానున్నారు.

Kamal Haasan and Indian 2 Movie Team coming to Hyderabad for Pre Release Event Full Details Here
Kamal Haasan : శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ మెయిన్ లీడ్ గా 1996లో వచ్చిన ఇండియన్(భారతీయుడు) సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ఇండియన్ 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2 సినిమాలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ.. ఇలా చాలామంది స్టార్స్ నటించారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఆల్రెడీ భారతీయుడు 2 సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. భారతీయుడు 2 సినిమా జులై 12న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. భారతీయుడు 2 మూవీ యూనిట్ ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. ఇప్పటికే మలేషియా, సింగపూర్.. లాంటి దేశాల్లో కూడా ప్రమోషన్స్ చేసారు. ఇక ఇండియాలో ఈ వారం అంతా గ్రాండ్ గా ప్రమోషన్స్ చేయనున్నారు.
Also Read : Aarambham : ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ ‘ఆరంభం’..
కల్కి సినిమాలో కమల్ హాసన్ కాసేపే కనిపించినా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టేసాడు. పార్ట్ 2లో కమల్ పాత్ర ఎక్కువ సేపు ఉండనుంది. కల్కి రిలీజయిన తర్వాత కమల్ హాసన్ మొదటిసారి హైదరాబాద్ కి రానున్నారు. భారతీయుడు 2 సినిమా ప్రమోషన్స్ కోసం కమల్ హాసన్, శంకర్, మిగిలిన మూవీ టీమ్ అంతా రానున్నారు. హైదరాబాద్ లోని N కన్వెన్షన్ లో జులై 7న సాయంత్రం 6 గంటల నుంచి భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. దీంతో తెలుగు కమల్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Get ready to welcome Senapathy to our very own Hyderabad for the Grand Pre-Release Event of #Bharateeyudu2 ??
? July 7th , 06:00PM Onwards
? N Convention, HyderabadBook your Free ?️at https://t.co/gL1Cjo3Wpr@IndianTheMovie ?? Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh… pic.twitter.com/039bOAP9x8
— Beyond Media (@beyondmediapres) July 5, 2024