Kamal Haasan : ‘కల్కి’లో కమల్ హాసన్.. యాస్కిన్ గెటప్ కోసం ఇంత కష్టపడ్డారా.. మేకింగ్ వీడియో చూశారా?
కల్కి సినిమాలో యాస్కిన్ పాత్ర అందర్నీ మెప్పించింది. కమల్ సరికొత్తగా కనిపించి తన నటనతో మెప్పించారు.

Kamal Haasan Kalki Yaskin Getup Making Video Released on his Birthday
Kamal Haasan : కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినిమాలో అయినా ఏ పాత్ర అయినా వేసి ప్రేక్షకులను మెప్పిస్తారు. తన కెరీర్లో రకరాల గెటప్స్ తో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఫిదా చేసారు. సినిమాలో పాత్ర కోసం ఎంత కష్టమైనా పడతారు. ఇటీవల కమల్ హాసన్ ప్రభాస్ కల్కి సినిమాలో సుప్రీమ్ యాస్కిన్ అనే నెగిటివ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.
కల్కి సినిమాలో యాస్కిన్ పాత్ర అందర్నీ మెప్పించింది. ఆ పాత్రలో కమల్ సరికొత్తగా కనిపించి తన నటనతో మెప్పించారు. నేడు కమల్ హాసన్ పుట్టిన రోజు కావడంతో కల్కి సినిమాలో కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్ లా ఎలా మారారు, ఆ పాత్ర షూటింగ్ కోసం ఎంత కష్టపడ్డారు అని ఓ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు నిర్మాణ సంస్థ. ఈ వీడియోలో కమల్ యాస్కిన్ గా కనిపించడానికి ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వగా కమల్ ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన్ని ఇంత ఏజ్ లో కూడా ఇంకా పాత్ర కోసం ఆ రేంజ్ లో కష్టపడుతున్నారంటే హ్యాట్సాల్ఫ్ చెప్పొచ్చు అని అంటున్నారు. మీరు కూడా కమల్ హాసన్ యాస్కిన్ లా మారిన మేకింగ్ వీడియో చూసేయండి..