Project K : గుడ్ మార్నింగ్ అమెరికా.. ప్రాజెక్ట్ K కోసం హాలీవుడ్ నుంచి హాయ్ చెప్తున్న కమల్..

ఇప్పటికే ప్రభాస్, రానా అమెరికాకు చేరుకున్నట్టు హాలీవుడ్ నుంచి ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ చేశారు. తాజాగా నేడు ఉదయం గుడ్ మార్నింగ్ అమెరికా అంటూ హాలీవుడ్ నుంచి కమల్ హాసన్ ఫొటోని షేర్ చేశారు చిత్రయూనిట్.

Project K : గుడ్ మార్నింగ్ అమెరికా.. ప్రాజెక్ట్ K కోసం హాలీవుడ్ నుంచి హాయ్ చెప్తున్న కమల్..

Kamal Haasan land in Hollywood for Project K Movie Comic Con Event

Updated On : July 19, 2023 / 12:22 PM IST

Kamal Haasan Project K :  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ కనిపించబోతుంది. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఈ ఈవెంట్ లో పాల్గొనబోయే మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే పాల్గొనబోతున్నట్లు నిర్మాతలు ఆల్రెడీ తెలిపారు. అయితే వీరితో పాటు రానా కూడా పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్, రానా అమెరికాకు చేరుకున్నట్టు హాలీవుడ్ నుంచి ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ చేశారు.

Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మూవీ కాదు.. ఒక షార్ట్ ఫిలిం..

తాజాగా నేడు ఉదయం గుడ్ మార్నింగ్ అమెరికా అంటూ హాలీవుడ్ నుంచి కమల్ హాసన్ ఫొటోని షేర్ చేశారు చిత్రయూనిట్. అమెరికా వీధుల్లో కమల్ హాసన్ సరదాగా నడుస్తున్న ఫొటోని షేర్ చేసి గుడ్ మార్నింగ్ అమెరికా.. లవ్ ఫ్రమ్ సిటీ అఫ్ రైజింగ్ సన్ అని పోస్ట్ చేశారు చిత్రయూనిట్. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ ఏమని ప్రకటిస్తారా, ఎలాంటి గ్లింప్స్ రిలీజ్ చేస్తారా అని అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.