Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మూవీ కాదు.. ఒక షార్ట్ ఫిలిం..

బ్రో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయిన సాయి ధరమ్ తేజ్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒక షార్ట్ ఫిలిం అని తెలియజేశాడు. ఆ ఫిలిం టైటిల్ 'సత్య'.

Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మూవీ కాదు.. ఒక షార్ట్ ఫిలిం..

Sai Dharam Tej next project is Satya Short feature film

Updated On : July 18, 2023 / 7:51 PM IST

Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఏప్రిల్ లో విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తేజ్.. ఇప్పుడు బ్రో (Bro) సినిమాని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా సాయి ధరమ్ మెయిన్ లీడ్ లో నటిస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ వినోదయ సిత్తంకి రీమేక్ గా వస్తుంది. ఈ నెల 28న ఈ మూవీ రిలీజ్ కానుంది.

Sai Dharam Tej : ఆరు నెలలు బ్రేక్ తీసుకోని మరో సర్జరీకి వెళ్లనున్న సాయి ధరమ్ తేజ్..

ఇక ఈ మూవీ తరువాత సాయి ధరమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎంటని అందరిలో ఆసక్తి నెలకుంది. తాజాగా ఆ విషయాన్ని తేజ్ తెలియజేశాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి తేజ్ ఒక షార్ట్ ఫీచర్ ఫిలింలో నటించాడట. ‘సత్య’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ ఫిలిం 23 నిముషాలు పాటు ఉండనుందట. ఈ షార్ట్ ఫిలింలో ఒక 6 నిముషాలు సాంగ్ కూడా ఉంటుంది. తేజ్ బెస్ట్ ఫ్రెండ్ నవీన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తే.. స్వాతి అనే స్నేహితురాలు తేజ్ కి భార్యగా చేసిందట. మరో మిత్రుడు హర్షిత్ ఈ సినిమాని నిర్మించాడట. ఈ మూవీ దేశ సైనికులు గురించి తెరకెక్కింది.

Sai Dharam Tej : నా లవ్ ఫెయిల్యూర్స్‌ని కూడా ఫ్యామిలీలో ఆయనతోనే షేర్ చేసుకుంటా..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ షార్ట్ ఫిలింని రిలీజ్ చేయనున్నారు. సైనికుల భార్యలు.. తమ భర్తలని దేశం కోసం పంపించి ఎటువంటి త్యాగం చేస్తున్నారు అనేది ఆ షార్ట్ ఫిలిం స్టోరీ అని వెల్లడినించాడు. సాయి ధరమ్ తేజ్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. కాగా తేజ్ బ్రో రిలీజ్ తరువాత మరో ఆరు నెలలు బ్రేక్ తీసుకోబోతున్నాడట. ఆ బైక్ యాక్సిడెంట్ నుంచి ఇంకా రికవరీ అవ్వలేదట. అలాగే ప్లేట్స్ తొలిగించడానికి ఒక చిన్న సర్జరీ కూడా ఉన్నట్లు వెల్లడించాడు. కాబట్టి ఒక ఆరు నెలలు పాటు గ్యాప్ తీసుకోని కంప్లీట్ రెస్ట్ లో ఉండి పూర్తిగా కోలుకొని మళ్ళీ వస్తానని రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.