Kamal Haasan : ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నాకు వార్నింగ్ ఇచ్చారు.. ఆయనకు డ్యాన్స్ రాదు.. కమల్ హాసన్ వ్యాఖ్యలు..

కమల్ హాసన్ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Kamal Haasan : ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నాకు వార్నింగ్ ఇచ్చారు.. ఆయనకు డ్యాన్స్ రాదు.. కమల్ హాసన్ వ్యాఖ్యలు..

Kamal Haasan Shocking Comments on Prabhas Uncle Krishnam Raju in Kalki Promotions

Kamal Haasan : ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 27న రాబోయే కల్కి సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్.. లాంటి చాలా మంది స్టార్ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, ప్రియాంక దత్, స్వప్నదత్ లు కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్ చేసి వీడియో రిలీజ్ చేశారు.

ఈ స్పెషల్ చిట్ చాట్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలపగా కమల్ హాసన్, అమితాబ్ తాము యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చేసిన సినిమాలు, అప్పటి పరిస్థితుల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో కమల్ హాసన్ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : Varahi Ammavaru : పవన్ వారాహి అమ్మవారి దీక్ష.. ఈ దీక్ష ఏంటి? ఎందుకు చేస్తారు? వారాహి అమ్మవారు ఎవరు?

కమల్ హాసన్ మాట్లాడుతూ.. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గారు నాకు తెలుసు. ఆయనతో కలిసి నేను పనిచేసాను. నేను డ్యాన్స్ అసిస్టెంట్ గా పనిచేసేటప్పుడు ఆయన హీరోగా చేస్తున్నారు. కృష్ణం రాజు చేస్తున్న ఒక సినిమాకు నేను డ్యాన్స్ అసిస్టెంట్ గా వర్క్ చేశాను. ఆయనకు స్టెప్పులు ఇస్తుంటే ఇలాంటి కష్టమైన స్టెప్స్ ఇవ్వకు అని భయపెట్టేవాళ్ళు. ఆయనకు అంతగా డ్యాన్స్ రాదు. అందుకే నన్ను సరదాగా భయపెట్టేవాళ్ళు. కష్టమైన స్టెప్స్ ఇస్తే నీ పని చెప్తా అని వార్నింగ్ ఇచ్చేవాళ్ళు అని అప్పటి సంగతులను గుర్తుచేసుకున్నారు. దీంతో కమల్ వ్యాఖ్యలు వైరల్ గామారాయి.