‘థగ్‌ లైఫ్‌’ ఈవెంట్‌లో కమల్ కామెంట్స్‌పై దుమారం… పోస్టర్లను చించి… ఆయన సినిమాలను బహిష్కరిస్తామన్న కన్నడ ప్రజలు

కమల్‌-మణిరత్నం కాంబోలో రూపుదిద్దుకున్న ‘థగ్‌ లైఫ్‌’ జూన్‌ 5న ఈ సినిమా విడుదల కానుంది.

‘థగ్‌ లైఫ్‌’ ఈవెంట్‌లో కమల్ కామెంట్స్‌పై దుమారం… పోస్టర్లను చించి… ఆయన సినిమాలను బహిష్కరిస్తామన్న కన్నడ ప్రజలు

Kamal Hassan

Updated On : May 28, 2025 / 3:16 PM IST

కమల హాసన్ నటించిన ‘థగ్‌ లైఫ్‌’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌లో కమల్‌ హాసన్‌ చేసిన కామెంట్స్‌ దుమారం రేపుతున్నాయి.

శివరాజ్‌ కుమార్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడిన కమల్.. ఇక్కడ తనకు ఓ కుటుంబం ఉందని, అందుకే వచ్చానని తెలిపారు. కన్నడ కూడా తమిళం నుంచే పుట్టిందని చెప్పారు. దీంతో కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప దీనిపై స్పందిస్తూ.. మాతృభాషను అభిమానించడం మంచిదేనని, అదే సమయంలో ఇతర భాషలను అవమానించడం సరికాదని అన్నారు. భారత్‌ సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కొన్ని వందల ఏళ్లుగా కన్నడ భాష ఉందని, కమల హాసన్ వంటివారు దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

దక్షిణాదిలో సోదరభావాన్ని పెంపొందించాల్సిందిపోయి, కొన్నేళ్లుగా కమల హాస్ అనుచిత కామెంట్స్‌ చేస్తున్నారని అన్నారు. కమల హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని విజయేంద్ర యడియూరప్ప డిమాండ్ చేశారు.

కాగా, కమల్‌ కామెంట్లపై పలు కన్నడ సంఘాలు స్పందిస్తూ.. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి. లేకపోతే కర్ణాటకలో కమల హాసన్ సినిమాలను బహిష్కరిస్తామని హెచ్చరించాయి. బెంగళూరులో థగ్‌లైఫ్‌ సినిమా బ్యానర్లు, పోస్టర్లను కొందరు చింపేశారు. కాగా, కమల్‌-మణిరత్నం కాంబోలో రూపుదిద్దుకున్న ‘థగ్‌ లైఫ్‌’ జూన్‌ 5న ఈ సినిమా విడుదల కానుంది.