‘వర్మ మార్క్’ కమ్మరాజ్యంలో కడపరెడ్లు : ట్రైలర్
దీపావళి కానుకగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి, మాటమీద నిలబడ్డాడు వర్మ.. సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ విడుదల చేశాడు.

దీపావళి కానుకగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి, మాటమీద నిలబడ్డాడు వర్మ.. సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ విడుదల చేశాడు.
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రూపొందుతున్న ఈ మూవీ నుంచి దీపావళికి ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు చెబుతూ.. గతకొద్ది రోజులుగా సినిమాలోని రకరకాల పోస్టర్స్ వదులుతూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నాడు ఆర్జీవీ.
సదరు పోస్టర్లలో వైఎస్, జగన్ జగన్, చంద్రబాబు, లోకేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదితరులను చూపించాడు. దీపావళి కానుకగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి, మాటమీద నిలబడ్డాడు వర్మ.. సోషల్ మీడియా ద్వారా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ విడుదల చేశాడు.
Read Also : చిట్టి నడుమునే చూస్తున్నా.. ‘భీష్మ’ : ఫస్ట్‌లుక్
‘బ్రేకింగ్ న్యూస్.. మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు పార్టీ చరిత్రలోనే ఎవ్వరూ రుచి చూడనంత ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత కొన్ని చాలా విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయ్’ అంటూ వర్మ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘బ్రేకింగ్ న్యూస్.. మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు పార్టీ చరిత్రలోనే ఎవ్వరూ రుచి చూడనంత ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత కొన్ని చాలా విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయ్’ అంటూ వర్మ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులతో పాటు, భవిష్యత్తులో జరగబోయే పరిణామలకు తన ఊహాలను జోడించి ట్రైలర్ కట్ చేశాడు వర్మ. ఈ ట్రైలర్ పొలిటిషియన్స్, జర్నలిస్ట్స్, రౌడీస్, ఫ్యాక్షనిస్ట్స్, పోలీస్ పీపుల్ అండ్ కామన్ పీపుల్‌కి తన తరపున దివాళీ గిఫ్ట్ అని చెప్పాడు.. సోషల్ మీడియాలో ట్రైలర్ ఎంత వైరల్ అవుతుందో చూడాలి మరి..