ఆలియా, రణ్ బీర్ కు దేశభక్తి లేదన్న కంగనా

తనతో పెట్టుకుంటే ఎవరికైనా సరే చుక్కలు చూపిస్తానంటోంది.. బాలివుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఛాన్స్ దొరికితే చాలు తనకి నచ్చని వారి పై మాటల తూటాలు పేలుస్తోంది. లేటెస్ట్ గా మరోసారి.. కంగనా, హీరోయిన్ ఆలియా భట్ ని టార్గెట్ చేసింది. పనిలో పనిగా ఆలియా ప్రియుడు రణ్ బీర్ ని కూడా ఏకిపారేసింది. రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సెర్మనీలో.. ఆలియా, రణ్ బీర్ కపూర్ ఉత్తమ నటీ, నటుడిగా అవార్డ్ అందుకున్నారు.
Read Also : కారణం అదే : ప్రియాంక, నిక్ జోనస్ విడాకులు?
ఆ తర్వాత స్టేజ్ మీదే ఆలియా.. రణ్ బీర్ కు ఐ లవ్ యూ చెప్పింది. దీని గురించే కంగనా ఓ ప్రెస్ మీట్ లో ప్రస్తావిస్తూ స్టేజ్ మీద ముద్దు ముచ్చట్లు చెప్తారు కానీ.. దేశం గురించి చెప్పమంటే మాత్రం నా అభిప్రాయం మీకెందుకంటారని.. గతంలో పుల్వామా అటాక్ పై స్పందించమన్నప్పుడు ఆలియా చేసిన కామెంట్స్ ని గుర్తుచేసింది కంగనా.
ఆలియా, రణ్ బీర్ ని యంగ్ కిడ్స్ అనడంపై కూడా కంగనా ఓ రేంజ్ లో సెటైర్లు వేసింది. రణ్ బీర్ వయసు 36, ఆలియాకు 26.. వాళ్లిద్దరూ ఇంకా పిల్లలేంటి అని ప్రశ్నించింది. మణికర్ణిక సినిమా టైంలోనే.. కంగనా, ఆలియా మధ్య విభేదాలొచ్చాయి. మణికర్ణిక డైరెక్టర్ విషయంలో వివాదం చెలరేగినప్పుడు.. ఆలియా తనకి సపోర్టింగ్ గా మాట్లాడలేదని కంగనా మనసులో పెట్టుకుంది. ఇక అప్పటి నుంచి ఆలియా ని టార్గెట్ చేస్తూనే ఉంది.
మరోవైపు కంగనా అంతలా రెచ్చిపోతుంటే.. ఆలియా మాత్రం కంగనాపై తనకెలాంటి కోపం లేదంటోంది. పైగా.. కంగనలాగా మనసులో ఉన్నది ధైర్యంగా బయటకు చెప్పడం తన వల్ల కాదని అందుకే తనంటే గౌరవం అని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది.
Read Also : మీరు SBI కస్టమరా..? మీకు బ్యాంకు విధించే 5 ఛార్జీలు ఏంటో తెలుసా?