Kangana Ranaut : పోకిరి సినిమా నేను చేయాలి.. పూరి జగన్నాద్ సెలెక్ట్ చేశారు.. కానీ..
పూరి జగన్నాధ్ టాలీవుడ్ కి చాలా మంది హీరోయిన్స్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఉంది. పూరి - ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో కంగనా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ కంగనా అంతకుముందే................

Kangana Ranaut selected for Puri Jagannadh Mahesh Babu Pokiri Movie But why she missed that project
Kangana Ranaut : టాలీవుడ్(Tollywood) సూపర్ హిట్ సినిమాల్లో పోకిరి(Pokiri) ఒకటి. మహేష్ బాబుకి(Mahesh Babu) స్టార్ హీరో రేంజ్ నుంచి సూపర్ స్టార్ ఇచ్చిన సినిమా పోకిరి. పూరి జగన్నాధ్(Puri Jagannadh) దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా జంటగా తెరకెక్కిన పోకిరి అప్పట్లో భారీ విజయం సాధించి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
పూరి జగన్నాధ్ టాలీవుడ్ కి చాలా మంది హీరోయిన్స్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఉంది. పూరి – ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో కంగనా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ కంగనా అంతకుముందే పోకిరి సినిమాతోనే తెలుగు పరిశ్రమకు పరిచయం అవ్వాల్సి ఉందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చంద్రముఖి 2 సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా హైదరాబాద్ కి ప్రమోషన్స్ కి రాగా ఇక్కడ ప్రెస్ మీట్ లో కంగనా మాట్లాడుతూ.. నాలోని యాక్టర్ ని గుర్తించింది పూరి జగన్నాధ్. నేను ఇంకా గుర్తింపు తెచ్చుకున్న నటిని కాకముందే స్టార్ అవుతానని చెప్పారు. నాకు పోకిరి సినిమా అవకాశం వచ్చింది. పూరి జగన్నాధ్ నన్ను పోకిరి సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం చేయాలనుకున్నారు. కానీ అదే సమయంలో నాకు బాలీవుడ్ లో గ్యాంగ్‌స్టర్ సినిమా షూటింగ్ డేట్స్ కూడా ఉండటంతో పోకిరి సినిమా మిస్ చేసుకున్నాను. ఆ తర్వాత ప్రభాస్ తో ఏక్ నిరంజన్ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో నేను, ప్రభాస్ మంచి స్నేహితులం అయ్యాము అని తెలిపింది.