Kangana Ranaut : అత్త అయిన కంగనా రనౌత్.. మేనల్లుడిని ఎత్తుకొని మురిసిపోతూ..
తాజాగా కంగనా ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలు ఫ్యామిలీ ఫోటోలు అవ్వడం విశేషం.

Kangana Ranaut Shares her Nephew Photos with family
Kangana Ranaut : బాలీవుడ్(Bollywood) క్వీన్ కంగనా రనౌత్ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ, బాలీవుడ్ మాఫియాపై రెగ్యులర్ గా కౌంటర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా కంగనా ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలు ఫ్యామిలీ ఫోటోలు అవ్వడం విశేషం.
కంగనా రనౌత్ సోదరుడు అక్షత్ రనౌత్ భార్య రీతూ రనౌత్ ఇటీవల ఓ పండంటి బాబుకి జన్మనించ్చింది. ఆ బాబు ఫోటోలు, ఆ బాబుని కంగనా ఎత్తుకున్న ఫోటోలు, కంగనా తల్లి, సోదరుడు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తపరిచింది కంగనా. ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. నా సోదరుడు, అతని భార్య తల్లితండ్రులు అయ్యారు. చక్కని బాబుకి జన్మనిచ్చారు. ఆ బాబుకి అశ్వత్థామ అనే పేరు పెట్టాం. బాబుని, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని పోస్ట్ చేసింది.
Also Read : Sapta Sagaralu Dhaati : సప్త సాగరాలు దాటి.. సైడ్ B వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్..
దీంతో కంగనా తన మేనల్లుడిని ఆప్యాయంగా ఎత్తుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పలువురు అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు కంగనా సోదరుడు, అతని భార్యకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.