Kangana Ranaut : ధాకడ్ సినిమా విజయవంతం కావాలని.. శ్రీవారిని దర్శించుకున్న కంగనా రౌనత్

సోమవారం ఉదయం కంగనా తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఆలయ అధికారులు VIP బ్రేక్ దర్శనంలో కంగనాకి ప్రత్యేక దర్శనం............

Kangana Ranaut : ధాకడ్ సినిమా విజయవంతం కావాలని.. శ్రీవారిని దర్శించుకున్న కంగనా రౌనత్

Kangana

Updated On : May 16, 2022 / 9:16 AM IST

Kangana Ranaut :  బాలీవుడ్‌ క్వీన్ కంగనా రనౌత్‌ ప్రస్తుతం ‘ధాకడ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 20న థియేటర్లలో విడుదల కానుంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది కంగనా. తాజాగా కంగనా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

Kangana Ranaut : ఆ స్టార్ హీరోలు నా సినిమాని ప్రమోట్ చేయరు.. నాకు ఎక్కువ పేరు వస్తుందని ఫీల్ అవుతారు..

సోమవారం ఉదయం కంగనా తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఆలయ అధికారులు VIP బ్రేక్ దర్శనంలో కంగనాకి ప్రత్యేక దర్శనం చేయించారు. కంగనాతో పాటు చిత్ర యూనిట్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడింది. కంగనా మాట్లాడుతూ.. ”నా ధాకడ్ సినిమా రిలీజ్ అవ్వనుంది. అందుకే గోవిందాని దర్శించుకోవడానికి వచ్చాను. సినిమా విజయవంతం కావాలని మొక్కుకున్నాను. మీ అందరి ఆశీర్వాదం కూడా సినిమాకి కావాలి” అని తెలిపింది.