పిల్లలను సెక్స్ చేయమని తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్న కంగనా

తన సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోనిలిచింది కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్. పిల్లలు సెక్స్ కోరుకుంటే.. వెంటనే వారి కోరిక తీర్చేలా చేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో శనివారం(సెప్టెంబర్-28,2019)పాల్గొన్న కంగనా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. తానే హృతిక్ రోషన్ అయితే కంగనాకు ఫోన్ చేసి క్షమాపణలు చెబుతాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన ఫస్ట్ క్రష్ గురించి.. తన ఫస్ట్ రిలేషన్‌షిప్ గురించి కూడా ఆమె వివరించారు. సంప్రదాయాలు శృంగారాన్ని అనుమతించదని తెలుసు అంటూనే సెక్స్ పై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టింది.
కంగనా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరి జీవితంలో సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సెక్స్ కోరకుంటే.. ఎలాంటి మొహమాటం లేకుండా ఆ పని చేసేయండి అంటూ చెప్పింది. అంతేకాదు మనసులో కోరిక పెట్టుకొని దాని కోసం వేచి చూడకండి అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చింది. సంప్రదాయాలు శృంగారాన్ని అనుమతించదని తెలుసు అంటూనే సెక్స్ పై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టింది.
ఒకప్పుడు కేవలం శృంగారం కోసమే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనికి కట్టుబడి ఉండాలని చెప్పేవారు. చరిత్రలో చోటుచేసుకున్న దండయాత్రల కారణంగా ఇప్పటికీ మన ఆలోచనలు అక్కడే ఉన్నాయి. మన పవిత్ర గ్రంథాలు కూడా శృంగారాన్ని అనుమతించవు. కానీ పిల్లలు శృంగారంలో పాల్గొనడంపట్ల తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి. పిల్లలు కూడా శృంగారం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నేను శృంగారపరంగా యాక్టివ్‌గా ఉన్నానని తెలుసుకొని నా తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.నన్ను కోప్పడ్డారు కూడా.
పిల్లలు శృంగారంలో పాల్గొనేలా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలని కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో ప్రస్తుతం కంగనా నటిస్తోంది.